ఆంధ్రావనిలోఇవాళ జగనన్న చేదోడు పథకంలో భాగంగా షాపులున్న రజకులకు,నాయీబ్రాహ్మణులకు,దర్జీలకు ఏటా అందించే పది వేల రూపాయల సాయాన్ని అందించనున్నారు.ఇందుకు 285.35 కోట్ల రూపాయలను విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకూ ఈ పథకం కింద 583.78 కోట్ల రూపాయలను అందించారు. ఇవాళ చేదోడు పథకం అందుకోనున్న లబ్ధిదారుల సంఖ్య 2,85,350 మంది అని ప్రభుత్వం గణాంక సహితంగా చెబుతోంది.
షాపులన్న దర్జీలకు 146.10కోట్ల రూపాయలు అందించనున్నా రు.ఈ మొత్తాన్ని 1,46,103 మంది లబ్ధిదారులు అందుకోనున్నారు. షాపులున్న రజకులకు 98.744కోట్ల రూపాయల లబ్ధి అందనుంది.ఈ మొత్తాన్ని 98,439 మందికి అందిచనున్నారు.షాపులున్న నాయీబ్రాహ్మణులకు 40.81కోట్ల రూపాయలు అందించేందుకు నిర్ణయించారు. సంబంధిత అర్హుల ఎంపిక ప్రకారం మొత్తం 40,808 మందికి జగనన్న చేదోడు అందనుంది అని అధికారిక ప్రకటనలు వెల్లడిస్తున్నాయి. ఇదంతా వినేందుకు బాగానే ఉంది కానీ అసలే రాష్ట్రంలో అప్పుల్లో ఉంది కదా రెండు వందల కోట్లకు పైగా అందించే పథకానికి రెండు కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే పత్రికా ప్రకటనలు అవసరమా? ఎందుకని ప్రజాధనం ఈ విధంగా వృథా చేస్తున్నారని ఏపీ సర్కారు పై విమర్శలు గుప్పుమంటున్నాయి.
ఇదే సందర్భంలో టీడీపీ చేస్తున్న విమర్శలను జగనన్న వర్గాలు తిప్పికొడుతున్నాయి. తాము టీడీపీ కన్నా ఎక్కువగా ఏమీ ప్రచారం చేసుకోవడం లేదని, వీలున్నంత మేరకు ఖర్చలు తగ్గించుకునేందుకు,ఆడంబరాలు తగ్గించుకునేందుకే తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని అంటోంది పసుపు పార్టీ టీడీపీ.ఎవరి వాదన ఎలా ఉన్నా పత్రికా ప్రకటనల్లో కనీసం సంబంధిత శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు ఫొటో కూడా లేకపోవడం ప్రభుత్వ ఆలోచన రీతి ఏవిధంగా ఉందో ఇదొక తార్కాణమన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ పథకంకు సంబంధించి ఆ శాఖ మంత్రి ఫొటోనే ప్రకటనల్లో లేకుండా చేయడం సబబు కాదని ఇంకొందరు రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఆ రోజు చంద్రబాబు హయాంలో కూడా మంత్రులకు పెద్దగా విలువ లేకుండా పోయిందని, ఇప్పుడు కూడా అటువంటి పరిణామాలే పునరావృతం అవుతున్నాయని వారంతా అభిప్రాయపడుతున్నారు. ఒక్కసారి ఇటువంటి విషయాలపై ముఖ్యమంత్రి జగన్ పునరాలోచన చేయాలన్న సూచన లేదా హితవు కోరే మాట అన్నది ఒకటి వినవస్తోంది విపక్షాల నుంచి! వింటున్నారా జగన్ !