కేటీఆర్ ఇది నీకు న్యాయమా.?

Update: 2019-03-06 17:23 GMT
సామాజిక అంశాలపై చాలా యాక్టివ్‌ గా ఉంటాడు కేటీఆర్‌. పైకి రఫ్‌ గా కన్పిస్తారు కానీ చిన్న చిన్న విషయాలకు చలించిపోతారు. రెండేళ్ల క్రితం స్కూల్లో ప్రేయర్‌ చేస్తున్న పిల్లాడు నిక్కర్‌ ప్యాకెట్‌ లో చపాతి ఉండటాన్నిచూసి తట్టుకోలేకపోయారు. చిన్నపిల్లలకు స్కూల్స్‌ 11 తర్వాత ఉంటే ఎంత బావుంటుందో కదా అని ట్విట్టర్‌ ద్వారా రెస్పాండ్‌ అయ్యారు. చిన్నారులంటే కేటీఆర్‌ కు అంత ఇష్టం. అలాంటి కేటీఆర్‌ వల్ల ఈరోజు చిన్నారులు మండే ఎండలో మాడిపోవాల్సి వచ్చింది.

టీఆర్‌ ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు కేటీఆర్‌. తమ పార్టీకి బాగా కలిసొచ్చిన కరీంనగర్‌ నుంచి ప్రచారం మొదలుపెట్టారు. దీనికోసం హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ వెళ్లారు కేటీఆర్‌. ఆయన వెళ్లడం తప్పులేదు - ప్రచారం చేయడం తప్పులేదు. కానీ ఈ ఎన్నికల ప్రచారం కోసం లోకల్‌ గా ఉండే నాయకులు కాస్త ఓవర్‌ యాక్షన్‌ చేశారు. 11 నుంచి 14 ఏళ్లలోపు పిల్లల్ని బడి మాన్పించి తీసుకొచ్చారు. వారికి టీఆర్ ఎస్‌ ప్లకార్డులు ఇచ్చి ఎండలో నించోపెట్టారు. అసలే ఎండాకాలం. అపైన చిన్నారులు.  పాపం ఆ చిన్నారులు తట్టుకోలేకపోయారు. ఆ ప్లకార్డుల్నే గొడుగుగా చేసుకుని అలాగే కేటీఆర్ వచ్చేవరకు నిలబడ్డారు. అలాగని ఇదేమి ప్రభుత్వ కార్యక్రమం కాదు. పక్కా పార్టీ కార్యక్రమం. మరి ఇలాంటి కార్యక్రమానికి చిన్నారుల్ని తీసుకురావడం చాలా పెద్ద తప్పు. ఎండలో నించోపెట్టడం ఇంకా పెద్ద తప్పు. యాక్చువల్‌ గా ఈ విషయం కేటీఆర్‌ కు తెలియదు. కానీ తప్పు అనేది తెలిసి చేసినా తెలియక చేసినా ఎండలో బలైంది మాత్రం చిన్నారులే. మరి ఈ విషయం తెలిసిన తర్వాత కేటీఆర్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.
Tags:    

Similar News