ఇదిలా ఉంటే.. కరోనా ప్రారంభంలో అంటే గతేడాది మార్చిలో ప్రభుత్వం విద్యాసంస్థలను మూసి వేసింది. దీంతో అప్పటి నుంచి దాదాపు అనేక ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వారి వద్ద పని చేసే టీచర్లు, ఇతర సిబ్బందికి వేతనాలు ఇవ్వడం ఆపేశాయి. కొన్ని విద్యాసంస్థలు సగం వేతనాలు ఇవ్వగా.. మరి కొన్ని సంస్థలు భారీగా కోతలు విధించాయి. దీంతో ప్రైవేటు విద్యాసంస్థల్లో పని చేసే టీచర్లు సిబ్బంది రోడ్డు పడ్డారు. ఇన్నాళ్లు విద్యార్థులకు పాఠాలు బోధించి ఆత్మగౌరవంతో పని చేసిన ఉపాధ్యాయులు కొందరు కూలి పనులకు కూడా వెళ్తున్న వార్తలు మీడియాలో వచ్చాయి. అనేక మంది మనస్సు చంపుకుని హోటళ్లు నడుపుతూ, కూరగాయలు అమ్మడం కూడా చేసిన ఘటనలు ఉన్నాయి.
ఇకపోతే , చాలామంది టిఫిన్ సెంటర్స్ పెట్టుకొని కాలం వెల్లడిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనపై సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. టిఫిన్ సెంటరు పేరు'నిరుద్యోగి' చిత్రంగా ఆ పక్కనే ఉన్నత విద్యార్హతలు. ఎంఎస్సీ, బీఈడీ.. ఆపై బీఎల్ ఐఎస్సీ కూడా, ఇవన్నీ పూర్తిచేసింది ఎం.సంపత్ అనే విద్యాధికుడు, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సమీపంలోని శంకరపట్నంలో ఓ ప్రైవేటు పాఠశాలకు ఆయన కరస్పాండెంట్ గా వ్యవహరించారు. కరోనా దెబ్బకు విద్యాసంస్థ మూతపడటంతో బతుకు రోడ్డున పడింది. ఉపాధి కరవైన క్రమంలో హుజూరాబాద్ పట్టణంలో తోపుడు బండిపై ఇలా టిఫిన్ సెంటరు ఏర్పాటు చేసుకున్నారు. దానికి నిరుద్యోగి అని పేరుపెట్టి ఆ పక్కనే తన విద్యార్హతలను పేర్కొన్నారు.