జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లు ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే.. ఆ బాలిక మాటలను వినాల్సిందే.. తన కడుపులోని బాధనంతా కక్కేసిన ఆ విద్యార్థిని సీఎం జగన్ ముందే పవన్, లోకేష్ లను కడిగేసిన తీరు వైరల్ గా మారింది.
సీఎం జగన్ ఈ రోజు ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో నాడు-నేడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదువులను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని 45వేల స్కూళ్లలో మూడు దశలుగా నాడు-నేడు కార్యక్రమం ద్వారా మౌళిక వసతులు కల్పిస్తామని తెలిపారు.
జగన్ ప్రసంగం ముగిసిన తర్వాత పలువురు విద్యార్థులకు మాట్లాడే అవకాశం కల్పించారు. అందులో మైక్ నందుకున్న బాలిక.. ఏపీ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం చదువులను వ్యతిరేకిస్తున్న పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లపై వేసిన సెటైర్లు అద్భుతంగా పేలాయి. దీనికి జగన్ సహా వేదికపైనున్న నేతలు, విద్యార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా హారిక అనే విద్యార్థిని మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టినందుకు జగన్ కు కృతజ్ఞతలు తెలిపింది. కొంతమంది ఇంగ్లీష్ మీడియం వద్దని చెబుతున్నారని.. తెలుగు భాష రాని నారా లోకేష్ , ఇంటర్ పాస్ కాని పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నారని వాపోయింది. ఎందికిలా చెబుతున్నారో అర్థం కావడం లేదంది. వాళ్లు, వాళ్ల పిల్లలు మాత్రం విదేశాల్లో చదువుకోవచ్చు.. మేం మాత్రం ఏం పాపం చేశాం సార్ అంటూ విద్యార్థిని ప్రశ్నించగానే వేదిక చప్పట్లతో మార్మోగిపోయింది. పోటీ ప్రపంచంలో నెగ్గుకురావాలంటే మాకు ఇంగ్లీష్ అవసరం అంటూ బాలిక చెప్పిన సమాధానం విని అందరూ చప్పట్లతో విద్యార్థిని అభినందించారు.
తమకు ఓటు హక్కు లేదని చాలా మంది పట్టించుకోవడం లేదని.. మీరు మనసున్న మారాజు మాకోసం పాఠశాలల తీరును మారుస్తాన్నారంటూ మరో విద్యార్థిని హేమలత సీఎం జగన్ ను కొనియాడింది.
ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం వద్దంటున్న పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లాంటి వాళ్లకు విద్యార్థులే కౌంటర్లు ఇచ్చిన తీరు చర్చనీయాంశమైంది. జగన్ కు మద్దతుగా విద్యార్థులు గళమెత్తిన వైనం వైరల్ గా మారింది. విద్యార్థులు మాట్లాడిన వీడియో చూశాకైనా మరి ఈ నేతలు మారుతారో లేదో చూడాలి మరీ..
Full View