కశ్మీర్ సరిహద్దులో ఉరీ సైనిక శిబిరం మీద దాడి జరగటం.. 20 మంది వీర జవాన్లు మరణించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరిన్ని దాడులకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు తెగపడొచ్చన్న సంకేతాలు అందుతున్నాయి. ఇదిలా ఉంటే.. ముంబయి మహానగరంలో అనుమానంగా సంచరిస్తున్న వారిని తాము చూసినట్లుగా గురువారం స్కూలు విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. పఠాన్ సూట్లు వేసుకున్న ఐదుగురు వ్యక్తులు.. సాధారణ దుస్తుల్లో ఉన్న మరో వ్యక్తి అయుధాలతో కనిపించారని చెప్పటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఏదైనా దాడి జరుగుతుందన్న సందేహాలతో హైఅలెర్ట్ ప్రకటించి.. పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదిలా ఉంటే.. విద్యార్థులు చూసిన అనుమానితులకు సంబంధించిన ఊహా చిత్రాల్ని పోలీసులు విడుదల చేశారు. రాయ్ గఢ్ జిల్లాలోని ఉరాన్ సైనిక స్థావరం వద్ద సంచరిస్తున్నట్లుగా అనుమానిస్తున్న వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో అనుమానితుల కోసం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా స్కూళ్లు.. కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఉరీ ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో దేశంలో మరింత కలకలాన్ని రేపేందుకు వీలుగా పెద్ద ఎత్తున ఉగ్రదాడులకు అవకాశం ఉందన్న వాదనల నేపథ్యంలో అనుమానితుల కోసం గాలింపులు జరుగుతున్నాయి. అనుమానితుల్లో ఇద్దరికి సంబంధించిన ఊహాచిత్రాల్ని పోలీసులు విడుదల చేశారు. సో.. వీరిని మీరెక్కడైనా చూస్తే అలెర్ట్ అయి వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లటం మర్చిపోవద్దు.