జాతిపిత మహాత్మా గాంధీ చదివిన స్కూల్ మూతపడింది. అది కూడా గుజరాత్ ప్రభుత్వ ఆదేశాల మేరకే. దీంతో రాజ్ కోట్ లోని ఆల్ ఫ్రెడ్ హైస్కూల్ మొత్తం 150 మంది విద్యార్థులకు టీసీలు ఇచ్చి పంపించేసింది. ఈ స్కూల్ లో మహాత్మా గాంధీ మ్యూజియం ఏర్పాటు చేయనున్నామని గత ఏడాదే నోటిఫికేషన్ విడుదల చేసింది గుజరాత్ ప్రభుత్వం. రూ.12 కోట్లతో త్వరలోనే ఈ మ్యూజియం ఏర్పాటు కానుంది. ఈ స్కూలు ఆవరణలో మ్యూజియానికి సరిపడా స్థలం ఉండటం వల్లే ఆల్ ఫ్రెడ్ హైస్కూల్ ను అధికారులు ఎంపిక చేశారు.
ఈ స్కూల్ ఖాళీ చేయడంతో ఇందులోని విద్యార్థులందరినీ కరణ్ సింగ్ జీ హైస్కూల్ లో చేర్పించారు. ఈ నెలాఖరులోగా మొత్తం విద్యార్థులు, సిబ్బంది అందరినీ కొత్త స్కూల్ లో చేర్చే ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతంలో ఏర్పాటైన తొలి ఇంగ్లిష్ స్కూల్ ఇదే. బ్రిటిష్ పాలన కాలంలో కర్నల్ సింగ్ దీనిని నిర్మించారు. 1853 - అక్టోబర్ 17న ప్రారంభమైన ఈ స్కూల్‌ను మొదట్లో రాజ్ కోట్ ఇంగ్లిష్ స్కూల్ అని పిలిచేవాళ్లు. 1868లో రాజ్‌కోట్ హైస్కూల్‌గా, 1907లో ఆల్ ఫ్రెడ్ హైస్కూల్ గా పేరు మార్చారు. ఇక 1947లో స్వాతంత్ర్యం తర్వాత జాతిపిత గౌరవార్థం దీనికి మోహన్ దాస్ గాంధీ హై స్కూల్ గా మార్చేశారు. 18 ఏళ్ల వయసులో 1887లో గాంధీ ఈ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/