జంతువుల్లో పెద్ద పెద్ద ఆకారాలు కలిగిన డైనోసర్లను మనం సినిమాల్లో మాత్రమే చూశాం. ఇవి భూమ్మీద లక్షల ఏళ్ల క్రితం సంచరించాయని వాటి అవశేషాల ఆధారంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఆ సంచరించిన రాక్షస బల్లులు మాంసాహారులా..? శాఖాహారులా.. అనే మిస్టరీ ఇప్పటికీ వీడకుండానే ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో దొరుకుతున్న వాటి అస్థికలను బట్టి వాటి మెడ పొడవుగా ఉండేదని, తోక కూడా వంకరగా పెద్దగా ఉండేదని పరిశోధకులు చెబుతున్నారు.
తాజాగా టాంజానియా నదిలోని మెటుకా నది వద్ద ఉన్న క్వారీలో టైటనోపారస్ జాతికి చెందిన రాక్షస బల్లి ఆస్థిపంజరం కనుగొన్నట్లు మిడ్‌వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. డైైనోసర్ తోక భాగంలోని గుండె మాదిరిగా ఉండే ఓ ఎముక బయటపడడంతో ఇది రాక్షస బల్లికి సంబంధించినదేనని పరిశోధకులు నిర్దారణకు వచ్చారు. ఈ డైనోసర్లు 70 టన్నుల బరువు ఉండేవని, అవి చేతులను ఉపయోగించకుండా కాళ్లపై మాత్రమే నడిచేవని వారు చెబుతున్నారు.
ఇదే క్వారీలో డైనోసర్ కు సంబంధించిన ఇతర ఎముకలను కూడా గుర్తించారు. దక్షిణాఫ్రికాలోని టైటనోసారస్ జాతికి చెందిన డైనోసర్లు అమెరికా ప్రాంతంలో సంచరించేవని, వీటికి సంబంధించిన ఆధారాలను కనుగొన్నట్లు తెలుపుతున్నారు. అయితే డైనోసర్లు శాఖాహారులు అనడానికి ఆధారాలున్నాయని, కానీ ఇంకా పరిశోధనలు జరుపుతున్నామని వారు తెలుపుతున్నారు.
'క్రిటిషియన్ ' శకంలో అంతరించిపోతున్న డైనోసర్లలో టైటనోపారస్ ఒకటని, సాధారణంగా తోక భాగంలో ఎముక ఉండే డైనోసర్లు అరుదని పరిశోధకులు చెబుతున్నారు. దీన్ని బట్టి మానవుల లాగానే అవసరార్థం డైనోసార్లు మాంసాహారాన్ని మాత్రమే కాకుండా.. అవసరమైనప్పుడు శాఖాహారం కూడా తినేవని ఈ పరిశోధనలో తేలిందని వివరించారు. తామెన్ని పరిశోధనలు జరిపినా ఇంకా అంతుచిక్కని విషయాలు డైనోసార్ల గురించి బయటపడుతున్నాయంటున్నారు.