ఈ ప్రపంచంలో అంతుపట్టని విషయాల్లో జీవం పుట్టుక ఒకటి. తొలిసారిగా జీవం ఎలా పుట్టింది? దానికి గల కారణాలు ఏంటి? దాని పరిణామ క్రమం ఎలా జరిగింది? ఇలా చాలా అంశాలు ఇప్పటికీ సామాన్య మానవునికి ప్రశ్నలుగా మిగిలే ఉన్నాయి. దేవుణ్ణి నమ్మే వారయితే జీవానికి కారణం ఆ దేవుడు అనే ఒక్క మాటతో తెల్చి పడేస్తారు. కానీ దానిని వైజ్ఞానికంగా నిరూపించాలంటే చాలా కష్టం.
అందుకే ఇది శాస్త్రవేత్తలకు పెద్ద సవాలు. అయినా కానీ ఇప్పటికే మనకు జీవం పుట్టుకకు సంబంధించిన రహాస్యాలను తెలిపే ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. అయితే తాజాగా శాస్త్రవేత్తలు జీవం పుట్టుకకు సంబంధించిన మరో కారణాన్ని కనుగొన్నారు. అదే సూపర్ మౌంటైన్స్.
జీవం పుట్టుక ఈ నాటిది కాదు. ఇప్పటి వరకు జీవ పరిణామ క్రమంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా ఆవిర్భవించిన ఏక కణ జీవి అమీబా నుంచి నేటి మనిషి పుట్టుక వరకు జరిగిన పరిణామ క్రమంలో చోటు చేసుకున్న అంశాలను తాజాగా వివరించారు శాస్త్రవేత్తలు. దీనిపై ఎన్నో ఏళ్లుగా పరిశోధన చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ పరిశోధనల ఫలితంగా సూపర్ మౌంటైన్స్ ను కనుగొన్నట్లు పేర్కొన్నారు.
జీవం పుట్టుకకు ప్రధాన కారణం భూమి ఉద్భవించడం. అయితే ఈ భూమి కూడా సూపర్ మౌంటైన్స్ కారణంగా ఏర్పడిందని చెప్తున్నారు. ఇది 2 వేల నుంచి 18 వందల మిలియన్ ఏళ్ల క్రితం ఏర్పడిందని తెలిపారు. ఈ సూపర్ మౌంటైన్స్ హిమాలయాల కంటే చాలా పురాతనమైనవని పేర్కొన్నారు. వీటి కారణంగానే జీవం పుట్టుక ఏర్పడినట్లు చెప్పుకొచ్చారు.
సూపర్ మౌంటైన్స్ రెండు సార్లు ఏర్పడగా.. మొదటిసారి ఏర్పడినప్పుడు వాటి పైన ఉన్న మంచు కరగడం ప్రారంభించిందని తెలిపారు. దీనితోనే తొలిసారిగా జీవం ఏర్పడినట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఈ జీవం పుట్టుకకు ఆధారం అయిన లుటిటియం, జిర్కాన్ ల జాడను కూడా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇది ఏర్పడినప్పుడు భూమిపై ఆక్సిజన్ కూడా లేదని తెలిపారు. అనంతరం జరిగిన కొన్ని పరిణామాల కారణంగా ఆక్సిజన్ కూడా ఏర్పడిందని వివరించారు. ఇలా క్రమక్రమంగా ఆక్సిజన్ కూడా జీవుల పెరుగుదలకు అనుగుణంగా పెరుగుతూ వచ్చిందని అన్నారు. ఇందుకు సంబంధించిన పరిశోధనల కాపీని ఎర్త్ అండ్ ప్లానిటరీ అనే సైన్స్ జనరల్ లో ప్రచురితం చేశారు.