బ్రిటన్, రష్యా వ్యాక్సిన్లు కలిపి ఒక్కటిగా! ఇది చాలా పవర్ఫుల్ అంట..!
రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వీ, బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ తయారుచేసిన ఆస్ట్రాజెనికా సత్ఫలితాలు ఇస్తున్న విషయం తెలిసిందే. రష్యా వ్యాక్సిన్‌ను మనదేశంలో రెడ్డి ల్యాబ్స్ తీసుకున్నది. అయితే ఈ రెండు వ్యాక్సిన్లను కలిపి ఇప్పుడు మరో వ్యాక్సిన్నుతయారుచేయబోతున్నారట. ఈ వ్యాక్సిన్ చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కొత్త వ్యాక్సిన్ తయారీ కోసం బ్రిటన్, రష్యా శాస్త్రవేత్తలు చర్చలు జరుపుతున్నారు. ఒక వేళ ఈ రెండు వ్యాక్సిన్లు కలిపితే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయా లేదా అన్న విషయంపై వాళ్లు చర్చలు జరుపుతున్నారు.
రెండు వ్యాక్సిన్లను కలిపి తయారుచేసే కొత్త వ్యాక్సిన్ ద్వారా శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ మేరకు రష్యాలో క్లినికల్ ట్రయల్స్ జరగనున్నాయి. మొదట 18 ఏళ్లు పైబడిన వాళ్లకు ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఈ ప్రయోగాలు ఎంతకాలం నిర్వహిస్తారు. ట్రయల్స్ ఎప్పటివరకు ముగుస్తాయి అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఆక్స్ఫర్డ్ తయారు చేసిన ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ మెరుగైన ఫలితాలనే ఇచ్చింది.
కానీ ఈ వ్యాక్సిన్ ఇంకా వృద్ధులపై ప్రయోగించలేదు. దీంతో బ్రిటన్ ప్రభుత్వం దీనికి అనుమతి ఇవ్వలేదు. మరోవైపు స్పుత్నిక్ కూడా మెరుగైన ఫలితాలనే ఇచ్చింది. కొద్దిమందిలో దుష్ఫ్రభావాలు కనిపించినప్పటికీ అవి ఏమంతా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. మొత్తానికి ఈ రెండు వ్యాక్సిన్లను కలిపి తీసుకొచ్చే కొత్త వ్యాక్సిన్ ఎటువంటి ఫలితాలు ఇస్తుందో వేచి చూడాలి.