ఇప్పుడంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలు చేయటం లేదు కానీ.. ఆయన సినిమాలు చేస్తున్న వేళలో ఆయన సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో.. ఎప్పుడు పూర్తి అవుతుందో ఒక పట్టాన అర్థం కాని పరిస్థితి. ఇందుకు మినహాయింపుగా ఒకట్రెండు సినిమాలు చెప్పుచ్చు. అలాంటి వాటిల్లో కెమెరా మెన్ గంగతో రాంబాబు సినిమాను చెప్పాలి. అతి తక్కువ సమయంలో ఈ సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమాలో ఒక చానల్ ప్రముఖుడు.. చనిపోక ముందే చనిపోయినట్లుగా స్టోరీలు సిద్ధం చేయించిన వైనం చూపించటం ద్వారా మీడియాలోని ఒక పార్శాన్ని బాగా చూపించారని చెప్పాలి.
ముందుగానే ఊహించేసి.. ఇలా జరుగుతుంది కదా అని వండి వార్చేయటం మామూలే. అన్నిసార్లు పరిస్థితులు ఒకేలా ఉండవు. ఆ విషయాన్ని మిస్ అయిన వారందరికి షాక్ తగలటమేకాదు.. వారి పరువు పోయేలా చేసింది చంద్రయాన్ -2 ప్రయోగం. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న చంద్రయాన్ -2 ప్రయోగం పత్రికల వారికి ఉండే డెడ్ లైన తర్వాతే ఉంటుంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆగ్రశ్రేణి తెలుగు దినపత్రికలన్నీ అర్థరాత్రి ఒంటి గంట వరకూ న్యూస్ ను క్యారీ చేసే అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం మరో అరగంట వరకు అవకాశం ఉంది. కానీ.. చంద్రయాన్ -2 ప్రయోగం అర్థరాత్రి రెండు గంటలు దాటిన తర్వాతే. ఏ పత్రిక అయినా ఆ టైంలో ప్రింటింగ్ మధ్యలో ఉంటుంది. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మిగిలిన వారి కంటే తామే ముందుగా ఉన్నామని చెప్పుకునేందుకు చంద్రయాన్ -2 ప్రయోగం సక్సెస్ అయ్యిందని వండి వార్చేవారు.
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటం.. భారీ కౌంట్ డౌన్.. దేశ రాష్ట్రపతి స్వయంగా చూడాలని డిసైడ్ అయిన ప్రయోగం వాయిదా పడుతుందన్న ఆలోచన లేని క్రమంలో పిచ్చి పాఠకుల్ని పక్కదారి పట్టించేలా.. తాము ప్రయోగం తర్వాతే ప్రింటింగ్ చేశామన్న భావన కలిగించటం కోసం.. జరగని ప్రయోగాన్ని జరిగినట్లుగా రాసేశారు. పెద్ద పత్రికలు మాత్రం ఆచితూచి వ్యవహరించటం వల్ల ప్లాష్ .. ఫ్లాష్ వేసి.. టోన్ కాస్త మార్చారు. కానీ.. ఒక మోస్తరు పత్రికలు.. చిన్న పత్రికలు మాత్రం అడ్డంగా బుక్ అయ్యాయి. వార్తల్ని తాము ఎంతలా వండేస్తామన్న విషయాన్ని వారు తన రాతలతో చెప్పేశారు. అనూహ్య పరిస్థితుల్లో ప్రయోగం చివరి నిమిషాల్లో వాయిదా పడటంతో పలు మీడియా సంస్థల అసలు రంగు బయటకు రావటమే కాదు.. వారి పరువు పోయిన పరిస్థితి. ఉన్నది ఉన్నట్లుగా చెప్పే దానికి బదులుగా.. ఏదో చేయాలన్న తాపత్రయంతో చేసే పనులతో ఎంతటి నవ్వులపాలు అవుతామన్నది చంద్రయాన్ -2 చెప్పకనే చెప్పేసిందని చెప్పాలి.