తేత్రాయుగంలో సీతమ్మ తల్లిని అపహరించిన రావణాసురుడి ఆచూకీని కనిపెట్టడానికి శ్రీరాముడు వానరుల సాయం తీసుకున్నాడు. ఈ క్రమంలో సీతను దశకంఠుడు శ్రీలంకలో దాచిపెట్టాడని తెలిసిన రాముడు సముద్ర తీరానికి చేరాడు. అయితే సముద్రం దాటే వీలు లేకపోవడంతో వానర సైన్యం సాయంతో భారత్-శ్రీలంకల మధ్య 40 కిలోమీటర్ల పొడవునా రామసేతును నిర్మించాడని రాయాయణం చెబుతోంది. ఆ రాళ్లు సముద్రంలో మునగకుండా ప్రతి రాయిపై శ్రీరామ అని రాశారని.. దీంతో అవి తేలాయని చెబుతున్నారు. స్వల్పకాలంలోనే రామసేతును నిర్మించాక రాముడు లంకలో ప్రవేశించి రావణాసురుడిని సంహరించాడు.. ఇది పురాణ గాథ.
అయితే రామసేతు సహజసిద్ధంగా ఏర్పడిందని, ప్రకృతి సహజ నిర్మాణమని శాస్త్రవేత్తలు, హేతువాదులు నమ్ముతున్నారు. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరుణానిధి రామసేతుపై వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. రామసేతు కల్పితమని.. రాముడేమైనా ఇంజనీరా అని వ్యాఖ్యలు కలకలం రేపాయి.
అయితే రామసేతు ఉండటం వల్ల తీవ్ర తుఫానుల బారి నుంచి మనదేశం తప్పించుకుంటోందని, ఎన్నో వన్యప్రాణులకు, మడ అడవులకు రామసేతు ఉన్న ప్రాంతం రక్షణగా, ఆవాసంగా నిలుస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందులోనూ మనదేశంలో రాముడితో ముడిపడిన ప్రతి అంశం భావోద్వేగాలను రగులుస్తుంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు తాజా పరిశోధనలు రామసేతుపై ఏం చెబుతున్నాయంటే..
రామసేతు ఇప్పటికీ తమిళనాడులోని ధనుష్కోడి - రామేశ్వరం మధ్య ప్రాంతాల్లో ఉంది. గతంలో అమెరికా రాకెట్ ప్రయోగ సంస్థ.. నాసా ఉపగ్రహ చిత్రాల్లోనూ రామసేతు సముద్రంలో మునిగి ఉందని తెలిసింది. ఇండియా - శ్రీలంక మధ్య హిందూ మహా సముద్రంలో రామసేతు మునిగి ఉందని నాసా చిత్రాలు రుజువు చేశాయి.
అలాగే గతంలో డిస్కవరీ ఛానెల్ ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా ఉపగ్రహ చిత్రాలు, శాస్త్రవేత్తల పరిశోధనలను బట్టి చూస్తే ఈ వంతెన మానవ నిర్మితమేనని డిస్కవరీ చానెల్ ప్రకటించడం గమనార్హం.
రామసేతు ప్రాంతంలో ఇసుక తిన్నెపై సున్నపు రాళ్లను జత చేసినట్లు నిర్మాణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. రామసేతు ప్రాంతంలో ఉన్న ఇసుక తిన్నెలు అక్కడివేనని.. అయితే రామసేతు కోసం ఉపయోగించిన రాళ్లను మరొకచోట నుంచి పట్టుకొచ్చారని నిర్ధారించారు. ఈ విషయాన్ని వారు సైంటిఫిక్ పద్ధతుల ద్వారానే నిగ్గు తీల్చడం గమనార్హం.
మరోవైపు మనదేశంలో గోవాలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అనే జాతీయ సంస్థ ఉంది. ఇది సముద్ర సంబంధిత అంశాలపై పరిశోధనలపై చేస్తుంటుంది. వాతావరణ మార్పులు, సముద్రాల్లో ప్రభావం, సునామీలు ఇలా అనేక అంశాలపై పరిశోధనలు చేస్తుంది. ఈ నేపథ్యంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ రామసేతు ప్రాంతంలో పరిశోధనలకు సిద్ధమైంది.
ప్రస్తుతం రామసేతు ఉందని చెప్పబడుతున్న స్థలంలో ఎక్కడ చూసినా ఇసుక మాత్రమే ఉందని ఎన్ఐవో చెబుతోంది. మొత్తం డ్రిల్లింగ్ చేసి నమునాలపై పరిశోధనలు చేశాక కానీ రామసేతుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేమని ఆ సంస్థ అంటోంది. ఇందుకు దాదాపు రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని వెల్లడించింది.
మరోవైపు హిందువులు రామసేతును జాతీయ వారసత్వ కట్టడంగా ప్రకటించాలని కోరుతూ గతంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్రం పరిశోధనల పేరిట దాన్ని నాశనం చేయకుండా చూడాలని కోర్టును విన్నవించారు.
గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మనోహ్మన్ సింగ్ ప్రభుత్వం రామసేతు నిర్మాణాన్ని ధ్వంసం చేసి సేతు సముద్రం షిప్ ఛానల్ నిర్మించాలని అనేక ప్రయత్నాలు చేసింది. రామసేతు అడ్డుగా ఉండడం వల్ల భారత నౌకలు శ్రీలంక చుట్టు 400 కిలోమీటర్లు అధిక దూరం ప్రయాణించి రావాల్సి వస్తుందని ఇందుకు ఒక కారణాన్ని సాకుగా చూపింది. రామసేతును ధ్వంసం చేయడానికి మన్మోహన్ ప్రభుత్వం 2005లో సేతు సముద్రం షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్టును ఆమోదించింది. దీంతో రామభక్తులు ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ సుప్రీంకోర్టు గడపతొక్కారు. దీంతో.. సేతుసముద్రం ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లవద్దంటూ 2007లో సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆ తర్వాత దీన్ని పూర్తిగా ప్రభుత్వం వదిలేసింది.
ఇప్పుడు మళ్లీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ తన రెండేళ్ల పరిశోధనలో రామసేతు గురించి ఏం తేలుస్తుందో వేచిచూడాల్సిందే!