గ్లోబల్ వార్మింగ్.. గ్రీన్ హౌస్ వాయువుల ఎఫెక్ట్ తో వాతావరణంలో ఇప్పటికే పలు మార్పులు సంభవిస్తున్నాయి. దీనికితోడు మానవ తప్పిదాలు యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో వైరస్ ల పై ప్రయోగం పేరుతో వాటిని వ్యాపింపజేస్తుండటం వంటి అంశాలు మానవాళికి పెను సవాళ్లను విసురుతున్నాయి.
కరోనా వైరస్ ధాటికి యావత్ ప్రపంచం ఎంతలా స్తంభించి పోయిందో.. ప్రజలంతా ఎంత ఇబ్బంది పడ్డారో అంతా కళ్లారా చూశాం. మనిషి దగ్గితే భయపడే రోజులు వచ్చాయంటే అదంతా కరోనా ఫుణ్యమనే చెప్పాలి. భౌతిక దూరం పాటించడం.. శానిటైజర్లతో చేతులు కడుక్కోవడం.. ముఖానికి మాస్కులు ధరించడం లాంటివి కరోనా వైరస్ కారణంగానే మనకు అలవాటయ్యాయి.
ప్రస్తుతం చైనాలో మినహా ప్రపంచవ్యాప్తంగా కరోనా కంట్రోల్లోనే ఉంది. కోవిడ్ కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక మళ్లీ పరిస్థితులన్నీ యథాస్థితికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు 48 వేల 500 ఏళ్ల నాటి జోంబీ వైరస్ ను గుర్తించారు. దీనికి తోడు మరో 12 వైరస్ లను కొత్తగా వెలికి తీసినట్లు 'న్యూయార్క్ పోస్ట్' తన కథనంలో ప్రముఖంగా ప్రచురించింది.
న్యూయార్క్ పోస్ట్ కథనం మేరకు.. రష్యాలోని సైబీరియా ప్రాంతం ఎక్కువగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ మంచు పొరల కింద లభించిన నమునాలను యూరప్ సైంటిస్టులు అధ్యయనం చేయగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మంచు పొరల్లో 12 రకాల హానికరమైన వైరస్ లు ఉన్నట్లు గుర్తించారు. వీటిని సైంటిస్టులు జోంబీ వైరస్ లుగా పిలుస్తున్నారు.
వేల సంవత్సరాల నుంచి ఈ జోంబీ వైరస్ లు నిద్రాణ స్థితిలో ఉన్నాయని.. అయినప్పటికీ వాటిలో వైరస్ వ్యాపింపజేసే వ్యాధికారక శక్తిని కోల్పోలేదని గుర్తించారు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మంచు పరత్వాలు క్రమంగా కరుగుతున్నాయని వెల్లడించారు. దీని వల్ల గతంలో చిక్కుబడిపోయిన మిథేన్.. గ్రీన్ హౌస్ వాయువులు తిరిగి విడుదలై వాతావరణ మార్పులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
జోంబీ వైరస్ లు బయటి ప్రపంచంలోకి వస్తే జంతువులతోపాటు మానవాళికి ఎక్కువ ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని రష్యా.. జర్మనీ.. ఫ్రాన్స్ దేశాలకు చెందిన సైంటిస్టుల బృందం ఆందోళన వ్యక్తం చేస్తుంది. అయితే ఈ వైరస్ లు ఎంతకాలం బాహ్య ప్రపంచంలో జీవిస్తాయి.. ఎంత మేరకు ప్రభావం చూపగలుగుతాయనేది ఇప్పుడే ఒక అంచనాకు రాలేమని చెబుతున్నారు.
ఈ పరిశోధన వల్ల వైరస్ సంక్రమణ స్థాయిని మరింతగా అంచనా వేయడానికి దోహదపడుతుందని తెలిపారు. ఏది ఏమైనా జోంబో వైరస్ లో మంచులో ఉన్నంత వరకు మానవళి సేఫ్ అని అర్థమవుతోంది. మంచు కొండలు కరిగితే అప్పుడు వైరస్ లు మిథేన్ వాయువులతో చేరి గాలిలోకి చేరే అవకాశం లభిస్తుదని తెలుస్తోంది. అయితే వీటి ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.