రెగ్యులర్‌ కాఫీతో షుగర్‌ కు చెక్‌

Update: 2020-08-03 01:30 GMT
ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్‌ వ్యాదిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తీసుకుంటున్న ఆహారం మరియు లైఫ్‌ స్టైల్‌ కారణంగా ఈమద్య కాలంలో అధికంగా డయాబెటిస్‌ బారిన పడుతున్నట్లుగా వైధ్యులు చెబుతున్నారు. ఒక్క సారి డయాబెటిస్‌ ఎటాక్‌ అయితే జీవితాంతం దాంతో సహజీవనం సాగించాల్సిందే. అందుకే డయాబెటిస్‌ రాకుండానే ముందస్తు జాగ్రత్తగా ఉండాలి. షుగర్‌ వ్యాది రాకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తలు ఏమీ లేవు. కాని తాజాగా ఇండియన్‌ అమెరికన్‌ రీసెర్చ్‌ స్టడీ ప్రకారం ఎవరైతే ప్రతి రోజు క్రమం తప్పకుండా కాఫీ తాగుతారో వారికి షుగర్‌ వ్యాది వచ్చే అవకాశం తక్కువగా గుర్తించారు.

కాఫీ తాగే వారు టైప్‌ 2 డయాబెటీస్‌ బారిన పడే ప్రమాదం 11 శాతం తక్కువగా నిర్థారించారు. ఈ స్టడీ ప్రకారం నాలుగు సంవత్సరాలు క్రమం తప్పకుండా కాఫీ తాగిన వారు షుగర్‌ బారిన పడటం తగ్గింది. కాఫీ అప్పుడప్పుడు తాగిన వారు కూడా షుగర్‌ వ్యాది బారిన పడ్డట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. కాఫీ కంజంప్షన్‌ లో తేడాలు రావడం వల్ల షుగర్‌ వెంటనే ప్రభావం చూపుతుందని కూడా ప్రయోగంలో నిరూపితం అయినట్లుగా వారు పేర్కొన్నారు.

నాలుగు సంవత్సరాల కాలంలో ఎవరైతే రెగ్యులర్‌ గా కాఫీ తాగారో వారిలో 11 శాతం షుగర్‌ బారిన పడే ప్రమాదం తగ్గింది. ఇక కాఫీ వినియోగంను ఈ నాలుగు సంవత్సరాల్లో ఎవరైతే తగ్గించారో వారు 17 శాతం అధికంగా డయాబెటిస్‌ రిస్క్‌ పెరిగిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకే రెగ్యులర్‌ గా కాఫీ తాగడం మంచిదే అంటూ ఆ స్టడీ చేసిన వారు చెబుతున్నారు.


Tags:    

Similar News