ద్యావుడా...యూరిన్‌ తో బీర్ అంట‌!

Update: 2016-07-29 22:30 GMT
బీర్...మందు ప్రియులంద‌రికీ ప‌రిచయం అక్క‌ర్లేని సుర‌పానీయం. ఆల్కహాల్‌ చాలా తక్కువ మోతాదులో ఉన్నందున బీర్‌ ను చాలా మంది ఇష్టడతారు. అందుకే బీర్‌ పట్ల ఆడా - మగా అందరూ ఆకర్షితులవుతున్నారు. రకరకాల ఫ్లేవర్లలో బీర్‌ లు మార్కెట్‌ లో దర్శనమిస్తున్నాయి. ఈ లిస్ట్ లోకి మరో రకం బీర్‌ రంగ ప్రవేశం చేయనుంది. ఈ బీర్‌ ను దేనితోని తయారు చేస్తారో తెలుసుకుంటే షాక్ కు గురవుతారు. ఎందుకంటే ఈ బీర్ యూరిన్‌ తో తయారవుతోంది మరి. బెల్జియంలోని ఘెంట్‌ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. ఇపుడీ వార్త హ‌ల్‌ చ‌ల్ సృష్టిస్తోంది.

ఇంత‌కీ ఈ యూరిన్ బీర్‌ ను త‌యారు చేయ‌డానికి నేరుగా మూత్రం వాడ‌రు. ప‌లు ద‌శ‌ల్లో బీర్ త‌యారు చేస్తారు. శాస్త్రవేత్త‌లు దీని గురించి వివ‌రిస్తూ....యూరిన్ ను సోలార్‌ ఎనర్జీ ద్వారా నీరుగా మార్చే యంత్రాన్ని వారు కనుగొన్నామని తెలిపారు. ఇందులో మొదట యూరిన్‌ ను ఓ పెద్ద ట్యాంక్‌ లో నిల్వ ఉంచుతారు. సౌర విద్యుత్‌ తో పనిచేసే బాయిలర్‌ లో వేడి చేసి పొంగకుండా దానిని ప్రవహింపచేస్తారు. దీని వల్ల ఆ మూత్రం.. పొటాషియం - నైట్రోజన్‌ - పాస్ఫరస్‌ - నీరుగా విడిపోతుంది. ఆ నీరును ప్రాసెస్‌ చేసి మంచి టేస్టీ బీర్‌ గా తయారు చేస్తారు. ఇక యూరిన్‌ నుంచి వేరు చేసిన పొటాషియం - నైట్రోజన్‌ - పాస్పరస్‌ వంటి ఖనిజ లవణాలను పొలంలో ఎరువులుగా కూడా వాడుకోవచ్చని తెలుపుతున్నారు. ఈ మధ్య ఘెంట్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఈ మెషిన్‌ ను ఉంచి దాదాపు వెయ్యి లీటర్ల మూత్రాన్ని సేకరించామని అన్నారు. దీనిని ప్రాసెస్‌ చేసి రకరకాల ఫ్లేవర్లలో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు తెలిపారు.

బాబోయ్ ఇలాంటి బీర్‌ తో ఆరోగ్యం సంగ‌తేంటి అనే క‌దా మీ సందేహం? ఆరోగ్యానికి ఎటువంటి హానీ చేయదని బెల్జియం శాస్త్రవేత్త‌లు బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్తున్నారు.
Tags:    

Similar News