కాంగ్రెస్ కు సింధియా షాక్.. 'ఎంపీ' లో బీజేపీ ఆపరేషన్

Update: 2019-11-26 04:53 GMT
మధ్యప్రదేశ్ లో మళ్లీ అలజడి రేగింది. బోబాబోటా మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కలకలం రేగింది. కాంగ్రెస్ కు నమ్మిన బంటుగా.. కాంగ్రెస్ అంటేనే సింధియా కుటుంబంగా మెదిలిన జ్యోతిరాధిత్య సింధియా తాజాగా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. తాజాగా సింధియా తన ట్విట్టర్ అకౌంట్ లో కాంగ్రెస్ నేత పేరును తొలగించడం సంచలనంగా మారింది. ప్రజాసేవకుడు, క్రికెట్ ప్రేమికుడని మాత్రమే సింధియా తన బయేడేటాలో పేర్కొన్నారు. ఇది మధ్యప్రదేశ్ రాజకీయాలతోపాటు దేశ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీని పై కొందరు సింధియా ను వివరణ కోరగా.. ప్రజల సూచనతోనే తన బయేడేటా ను మార్చానని చెప్పడం కొసమెరుపు..

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారం లోకి రావడంలో రాహుల్ గాంధీతోపాటు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సారథిగా పనిచేసిన జ్యోతిరాధిత్య సింధియా పాత్ర ఎంతో ఉంది. అయితే మెజార్టీ సీట్లు సాధించిన మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సీఎంగా అందరూ కోరుకున్న పేరు జ్యోతిరాధిత్య సింధియానే. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం సీనియారిటీ పేరుతో కమల్ నాథ్ ను మధ్యప్రదేశ్ సీఎంగా నియమించింది. దీనివెనుక సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మంత్రాంగం ఉందన్న అనుమానాలు బలపడ్డాయి.

అయితే తాజాగా మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ గా అందరూ ఊహించిన విధంగా జ్యోతిరాధిత్య సింధియా పేరును కాకుండా దివంగత నేత అర్జున్ సింగ్ తనయుడు అజయ్ సింగ్ పేరును తెరపైకి తెచ్చారు. దీంతో తనకు సీఎం సీటు ఇవ్వక.. కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వకపోవడంపై సింధియా కలత చెందారు. తన ట్విట్టర్ ఖాతా నుంచి కాంగ్రెస్ నేత పేరు తొలగించారు. ఆయన బీజేపీ లోకి మారబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది.

ఇక మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ సైతం బీజేపీ మొదలు పెట్టిన ఈ ఆపరేషన్ మధ్యప్రదేశ్ ను ధీటుగా ఎదుర్కొనే పనిలో బిజీగా ఉన్నారు. మెజార్టీ తక్కువగా ఉండడంతో బీజేపీ ఎమ్మెల్యేల ను లాగే పనిలో ఉన్నారు. ఇక బీజేపీతోనూ సంప్రదింపులు జరుపుతున్నారట.. మోడీషాలకు దగ్గరవుతున్నట్టు సంకేతాలిచ్చారు. ఇక ప్లాన్ బిగా అసంతృప్తిగా ఉన్న సింధియాను కూడా బుజ్జగింపులకు తెరలేపారు. సింధియాకు ప్రభుత్వంలో కీలక పాత్ర ఇచ్చేందుకు రెడీ అయ్యారట.. ఇలా రెండువైపులా బీజేపీని కాపు కాసే పనిలో మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ బిజీ గా ఉన్నారు.

Tags:    

Similar News