సీఎం ఇవ్వలేం.. జ్యోతిరాదిత్య సింధియాకు ఆఫర్

Update: 2020-03-11 05:10 GMT
అధికారంలోకి రెండేళ్లు పూర్తి కాకుండానే మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి సంకటం ఎదురైంది. మొదటి నుంచి మధ్యప్రదేశ్ అధికార పీఠంపై కన్నేసిన బీజేపీ ఆ మేరకు చర్యలు చేపట్టింది. అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విబేధాలు, అసంతృప్తులు భారీగా ఉన్నాయి. దీంతో వాటిని సద్వినియోగం చేసుకుని కమలం పార్టీ సద్వినియోగం చేసుకుని పరోక్షంగా సహకరించి ఇప్పుడు అధికారం చేపట్టే అవకాశం ఉంది. రాజకీయాలంటేనే ఊహించనివి. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. మధ్యప్రదేశ్ లో వారం రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు మంగళవారం ఒక్కసారిగా ఉత్కంఠ మారాయి. జ్యోతిరాదిత్య సింధియా పార్టీకి రాజీనామా, అనంతరం 17మంది తమ ఎమ్మెల్యేల పదవికి, నలుగురు మంత్రులు కూడా రాజీనామాలు చేయడం చకాచకా జరిగిపోయాయి. సింధియా వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కలవడంతో ఇక మధ్యప్రదేశ్ ప్రభుత్వ పగ్గాలు బీజేపీకి వెళ్లునున్నాయని స్పష్టంగా తెలిసింది.

ఈ నేపథ్యం లో మధ్యప్రదేశ్ లో మరొకసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అసంతృప్తులు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తున్నా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పందించలేదు. తాత్కాలికంగా కొంచెం నచ్చజెప్పినా తగ్గుముఖం పట్టలేదు. ఆ అసంతృప్తులే ఇప్పుడు ఒక్కసారిగా బహిర్గతమై ఏకంగా ప్రభుత్వం కూలిపోయే స్థాయికి చేరింది. ఇప్పుడు కమల్ నాథ్ ప్రభుత్వానికి బలం లేదు. అధికారం నిలబెట్టుకునేందుకు దాదాపు 30 మంది ఎమ్మెల్యేల బలం కావాలి. సింధియాతో దాదాపు 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తోంది. వారంతా బీజేపీకి మద్దతు తెలపనున్నారు. దీంతో కమల్ నాథ్ ప్రభుత్వం కుప్పకూలి బీజేపీ గద్దెనెక్కే అవకాశం ఉంది.

ఇప్పుడు మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే ఎవరు ముఖ్యమంత్రి అనే ప్రశ్న వ్యక్తమవుతోంది. కొద్ దిమందితో వచ్చిన సింధియానా? లేక మాజీ సీఎం శివరాజ్ సింగ్? అనేది చర్చనీయాంశమైంది. బీజేపీ మాత్రం శివరాజ్ సింగ్ చౌహన్ ను ఖరారు చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా సింధియాను నియమిస్తే తమ పార్టీ ఎమ్మెల్యేల్లో కూడా విబేధాలు వస్తాయని గ్రహించి సీఎం పదవిని శివరాజ్ సింగ్ కే ఇచ్చేటట్టు పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇక తమ పార్టీలోకి రావడం తో జ్యోతిరాదిత్య సింధియాకు సీఎంగా ఎంపిక చేయక పోవడంతో కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేశారనే వార్త వినిపిస్తోంది. ప్రస్తుతం అతడి రాజ్యసభ పదవీకాలం ముగిసింది. దీంతో మళ్లీ రాజ్యసభకు పంపించేసి కేంద్రమంత్రిని చేస్తామని బీజేపీ అధిష్టానం తెలిపినట్టు సమాచారం.

కాంగ్రెస్ పార్టీకి భారీ షాకిచ్చిన జ్యోతిరాదిత్య సింధియా త్వరలో బీజేపీ లో చేరడానికి సిద్ధమయ్యాడు. అయితే తనకు, తన ఎమ్మెల్యేలకు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారోనని చర్చలు, బేరసారాలు సాగుతున్నాయి. అక్కడ కమల్ నాథ్ సీఎంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతున్న సింధియాను బీజేపీ కేంద్రంలో మంత్రిగా తీసుకోనుందని తెలుస్తోంది. అందుకోసం ఆయనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేసిందని..వెంటనే రాజకీయం మొదలైందని తెలుస్తోంది. సింథియా తొలుత మధ్యప్రదేశ్ సీఎం సీటునే ఆశించినా కూడా బీజేపీకి ఆయనకు నచ్చజెప్పి కేంద్రంలో మంత్రి పదవి ఇస్తామని చెప్పడంతో ఆయన కూడా పెద్దగా బేరసారాలు లేకుండా అంగీకరించారని బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. దీంతో మధ్యప్రదేశ్‌ను సుదీర్ఘకాలం పాలించిన బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి సీఎం కానున్నట్లు తెలుస్తోంది.

ఈ మొత్తం సంక్షోభానికి కారణం కాంగ్రెస్ వైఖరేనని స్పష్టం తెలుస్తోంది. గతేడాదిది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయం సాధించడంలో జ్యోతిరాదిత్య సింధియా కీలక పాత్ర పోషించారు. దీంతో ఆయన ముఖ్యమంత్రి పదవిని ఆశించగా సీనియర్ నాయకుడిగా ఉన్న కమల్ నాథ్ ను పార్టీ పార్టీ సీఎంగా ఎంపిక చేయడంతో కలత చెందాడు. పైగా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో అప్పుడప్పుడు విబేధాలు బహిర్గతమయ్యాయి. అప్పటి నుంచి ఆగ్రహంగా ఉన్న సింధియా తన తండ్రి మాధవరావ్ సింధియా జయంతి నాడే కాంగ్రెస్ పార్టీని వీడడం గమనార్హం.


Tags:    

Similar News