ఏపీలో కరోనా వ్యాప్తిపై సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ పై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షించిన సీఎం ఈ సందర్భంగా ఏపీలో కరోనా వ్యాప్తికి తమిళనాడు కోయంబేడు మార్కెట్ ఒక కారణం అని చెప్పుకొచ్చారు. ఆ మార్కెట్ వల్లే చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని.. చెన్నైలోని కోయంబేడు మార్కెట్ కు వెళ్లిన రైతులతోపాటు , అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన 700మంది కూలీలపై దృష్టిపెట్టామని తెలిపారు. ఈ 700మంది కూలీలు రాష్ట్రంలోకి ప్రవేశించారని.. వారికి అనుమతులు లేవని.. పరీక్షలు చేయించుకోలేదని.. వారి వల్లే కరోనా వ్యాపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి వివరాలు తెలుసుకొని పరీక్షలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వివరించారు.
ఏపీకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితోనే ముప్పు ఎక్కువగా ఉందని సీఎం జగన్ అన్నారు. వారిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.ఇందుకోసం సరిహద్దుల్లో 11 చోట్ల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో దేశంలోనే ఏపీ ముందుందని సీఎం జగన్ చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,65,069 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. దేశంలోనే అత్యధికంగా ప్రతీ 10 లక్షల మంది జనాభాకు 3091 పరీక్షలు చేస్తున్నట్టు వివరించారు.