ఏపీలో కేబినెట్‌లో ప్రక్షాళనకు ముహూర్తం రెడీ అయింది. ఈ నెల 11న సీఎం జగన్ కొత్త కేబినెట్‌ను ఏర్పా టు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న మంత్రులతో ఆయన పూర్తిగా రాజీనామాలు చేయిం చారు. గురువారం మధ్యాహ్నంజరిగిన కేబినెట్ మీటింగ్‌లో మంత్రులను ఎందుకు మారుస్తున్నారు? మాజీ లయ్యేవారికి దక్కే పదవులు.. గౌరవాలు.. వంటి అనేక అంశాలపై సీఎం జగన్ వివరించారు. మొత్తంగా ఈ కేబినెట్ సమావేశం భావోద్వేగాల మధ్య జరిగింది. కొందరు మంత్రులను కొనసాగించాల్సి ఉంటుందని కూడా సీఎం స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో మంత్రుల్లో గుబులు బయల్దేరిన విషయం తెలిసిందే. తమ కన్నా జూనియర్లను మంత్రి వర్గంలోకి తీసుకుని.. వారిని మళ్లీ కొనసాగించే అవకాశం ఉందని వార్తలు వచ్చిన నేపథ్యంలో సీనియర్లు గుర్రుగా ఉన్నారు. మేం పార్టీ కోసం.. పనిచేశాం.. జగన్ జైలుకు వెళ్లినా.. పార్టీ జెండాలు మోశాం.. అనేక త్యాగాలు కూడా చేశాం. మమ్మల్ని వదిలేసి..నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన వారికి ముక్కు మొహం తెలియనివారికి పదువులు ఎలా ఇస్తారంటూ.. వారు అంతర్గత సమావేశాల్లో ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. తమను కొనసాగించకపోతే.. ఇబ్బందులు తప్పవనే సంకేతాలు కూడా ఇస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఛాంబర్‌లో జరిగిన ఒక రహస్యసమావేశం.. వైసీపీ లో కాక రేపుతోంది. దీనికి సంబంధించి అనేక విమర్శలు, వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే.. నలుగురు మంత్రులు.. బొత్స ఛాంబర్‌లోకి హడావుడిగా ప్రవేశించారు.
ఏదో మంతనాలు చేశారు. ఆవెంటనే బయటకు వచ్చారు. వీరిలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, పశ్చిమ గోదావరి జిల్లో కొవ్వూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి తానేటి వనిత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఉన్నారు.
ఈ నలుగురు సుమారు 10 నిమిషాల పాటు రహస్యంగా చర్చించుకున్నారు. ఇక్కడ చిత్రం ఏంటంటే.. ఈ నలుగురు.. బొత్సతో కలిపి.. పార్టీలు మారి.. వైసీపీలోకి వచ్చిన వారే.. బొత్స 2014 ఎన్నికల సమయంలో పార్టీలోకి వచ్చారు. కన్నబాబు కూడా అంతే. వనిత కూడా అలానే వచ్చారు. అవంతి అయితే.. గత 2019 ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న అసంతృప్తుల ననేపథ్యంలో ఈ నలుగురు తమ ఫ్యూచర్ పై చర్చించుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు కనుక.. వీరు వైసీపీలో ఉంటారా.. జంప్ చేస్తారా.. అనేది ఆసక్తిగా మారింది. పైగా వీరిలో ఇద్దరు కాపు కులస్తులు కావడం.. జనసేన వైపు నుంచి ఆహ్వానాలు సిద్ధంగా ఉండడం వంటి పరిణామాల నేపథ్యంలో ఏదైనా జరగొచ్చని అంటున్నారు పరిశీలకులు. ఇక, మంత్రి కన్నబాబు.. ఓ మీడియా తో మాట్లాడుతూ.. యథాలాపంగా.. ఈ రహస్య భేటీకి ప్రాధాన్యం లేదని అనేశారు. కానీ, ఏదో ఉందని.. అందరూ చెప్పుకొంటున్నారు.