దేశ ప్ర‌ధ‌మ పౌరుడితో ఆమె ఫోటో?

Update: 2015-04-04 17:35 GMT
దేశ ప్ర‌ధ‌మ పౌరుడిని క‌ల‌వ‌టం మామూలు వాళ్ల‌కు సాధ్య‌మా? కాదంటే కాద‌ని ఎవ‌రైనా చెబుతారు. ఇక‌.. ఐఏఎస్ ట్రైనీల‌కు కూడా క‌ష్ట‌సాధ్య‌మైన వ్య‌వ‌హార‌మే. అలాంటిది ఒక న‌కిలీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి ఏకంగా రాష్ట్రప‌తితో ఫోటో దిగిన ఉదంతం బ‌య‌ట‌కు రావ‌టంతో నిఘా వ‌ర్గాల‌తో పాటు.. భ‌ద్ర‌తాధికారుల‌కు వ‌ణుకు తెప్పిస్తోంది.
భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ‌లోని లోపాల్ని చాటిచెప్పే ఈ ఉదంతం ఇప్పుడు ఆందోళ‌న క‌లిగిస్తోంది. లంచంతో ఐఏఎస్ ట్రైనీగా అవ‌తార‌మెత్తి.. ఎలాంటి జంకూ బొంకూ లేకుండా ద‌ర్జాగా.. ముస్సోరీలో శిక్ష‌ణ పొంద‌టం.. మ‌ధ్య‌లో బ‌య‌ట‌కు వ‌చ్చేసిన రూబీ చౌద‌రి ఉదంతం తెలిసిందే. ఆమెకు ఆమె వెళ్ల‌క‌పోవ‌టం.. అనంత‌రం జ‌రిపిన విచార‌ణ‌లో అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.
దీంతో రూబీచౌద‌రి లీల‌లు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.  గ‌త ఏడాది ముస్సోరీలోని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి ఐఏఎస్ అకాడ‌మీకి వెళ్లిన రాష్ట్రప‌తితో ఆమె ఫోటోలు దిగారు.  దేశ ప్ర‌ధ‌మ పౌరుడితో ద‌ర్జాగా ఫోటోలు దిగిన ఈ లేడీ కిలాడీ.. త‌న న‌కిలీ ఐఏఎస్ అవ‌తారంతో.. మాయ‌మాట‌లు చెప్పి.. వీరేంద‌ర్ మాలిక్ అనే అత‌న్ని పెళ్లి చేస‌కున్నారు. ఆమె న‌కిలీ లీల‌లు తెలిసిన త‌ర్వాత అవాక్కు అవుతున్నాడు. త‌న‌ను మోసం చేసిన విధానాన్ని వివ‌రించి త‌న‌కు న్యాయం చేయాల‌ని ఆయ‌న కోరుతున్నారు.
Tags:    

Similar News