ఏపీ సీఎంగా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వారందరికీ ఫుల్ సెక్యూరిటీ. కానీ ఇప్పుడు ఆయన మాజీ అయిపోయారు. ప్రతిపక్ష నేతగా మారారు. ప్రతిపక్ష నేతకు కల్పించే భద్రతనే చంద్రబాబుకు కల్పిస్తున్నారు. ఇటీవల గన్నవరం ఎయిర్ పోర్టులో ఆయనకు చెకింగ్ కూడా చేశారు.
ఇక చంద్రబాబు ప్రభుత్వంలో సీఎం కుమారుడిగా జడ్ ప్లస్ కేటగిరిలో ఉన్న మాజీ మంత్రి నారాలోకేష్ కు ఇప్పుడు సెక్యూరిటీ కట్ చేశారు. కేవలం నలుగురు గన్ మెన్లకు తగ్గించేశారు. ఇక సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఫ్యామిలీ మెంబర్స్ అయిన నారా భువనేశ్వరీ, నారా బ్రహ్మణీలకు కేటాయించిన భద్రతను తాజాగా జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
చంద్రబాబు సీఎంగా ఉండగా వీరికి భద్రతను కట్టుదిట్టంగా నియమించుకున్నారు.కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో సహజంగానే మాజీలకు , వారి కుటుంబ సభ్యులకు సెక్యూరిటీని నిబంధనల ప్రకారం కట్ చేయడం ఆనవాయితీ..
ప్రతిపక్షంలో ఉండగా జగన్ కు సాధారణ భద్రత ఉండేది. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కు కూడా సెక్యూరిటీ ఉండేది కాదు. ఇప్పుడు అదే ఒరవడి చంద్రబాబుకు వచ్చింది. నారా భువనేశ్వరీ, బ్రాహ్మణీలకు భద్రత కట్ అయ్యింది. అంతా నిబంధనల ప్రకారం జరుగుతున్న ఈ వ్యవహారాన్ని టీడీపీ ఎలా చూస్తుందో చూడాలి మరీ..