పచ్చగా, ప్రశాంతంగా ఉండే లక్షద్వీప్ లో చిచ్చు మొదలైందా ? ఇపుడు మొదలైన చిచ్చు కేంద్రప్రభుత్వం పుణ్యమనే చెప్పాలి. దశాబ్దాల తరబడి ప్రశాంతంగా ఉన్న దీవుల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. దీనికి కారణం ఏమిటంటే లక్షద్వీపంలో ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత అయిన ఆయేషా సుల్తానాపై రాజద్రోహం కేసు నమోదవ్వటమే. నిజానికి సుల్తానా కేంద్రప్రభుత్వాన్ని నేరుగా ఏమీ అనలేదు. కేవలం లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ పైన మాత్రమే ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అసలు అడ్మినిస్రేటర్ పైన కూడా ఆమె అంతటి ఘాటు వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఏమొచ్చిందంటే కేంద్రం ప్రవేశపెట్టిన కొన్ని చట్టాలపైనే లక్షద్వీప్ లో ఆందోళణలు పెరిగిపోతున్నాయి కాబట్టే. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రపుల్ కే పటేల్ ప్రతిపాదనల రూపంలో పెట్టిన చిచ్చు కారణంగా ఇపుడు ద్వీపమంతా అట్టుడికిపోతోంది. కేరళకు అత్యంత సమీపంలో ఉండే ద్వీపంలో జనాభా సుమారు 90 వేలు. జనాభాలో 97 శాతం ముస్లింలే. ఉండటానికి లక్షద్వీప్ 36 దీవుల సమాహారమైనా జనాభా ఉండేది మాత్రం 10 దీవుల్లోనే. ఇది కేంద్రపాలిత ప్రాంతం కావటంతో ఈ ద్వీపానికి మిగిలిన దేశంతో పెద్దగా సంబంధం కూడా ఉండదు.
ఇలాంటి ద్వీపంలో కొత్తగా నియమ నిబంధనల పేరుతో అడ్మినిస్ట్రేటర్ చిచ్చుపెట్టారు. ఈయన ప్రతిపాదించిన కొత్త నిబంధనలను జనాభా మొత్తం వ్యతిరేకించిన కారణంగానే ఇపుడు లక్షద్వీప్ అట్టుడికిపోతోంది. ఇంతకీ అడ్మినిస్ట్రేటర్ చేసిన కంపు ఏమిటంటే జనాభా మొత్తాన్ని వ్యతిరేకించే ప్రకటన చేయటమే. ఇంతకీ అవేమిటంటే సంబంధిత శాఖ అనుమతి లేకుండా గోవులు, బర్రెలను వధించటం, మాంసాన్ని విక్రయించటం. ఇక్కడ జనాభాలో అత్యధికం ముస్లింలు కావటంతో గోవధ, గోమాంసం అమ్మటం, తినటం దశాబ్దాలుగా జరుగుతోంది. దీన్ని కొత్తగా నిషేధించారు.
అలాగే ఇద్దరికన్నా ఎక్కువమంది పిల్లలున్న వారు పంచాయితి ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నియమం తెచ్చారు. ఇక్కడ కుటుంబనియంత్రణ లేదు. కాబట్టి సహజంగానే ఏ కుటుంబంలో కూడా చాలామంది పిల్లలే ఉంటారు. అందుకనే దీన్ని కూడా జనాలు వ్యతిరేకిస్తున్నారు.
జనాభా ఉన్న 10 దీవుల్లోను మద్యం వ్యాపారానికి అనుమతిచ్చారు. ఇప్పటివరకు ఒక్క దీవిలో తప్ప మిగిలిన తొమ్మిది దీవుల్లో ఎక్కడా మద్యం అన్నదే కనబడదు. తాజా ప్రతిపాదన ప్రకారం మొత్తం 10 దీవుల్లోను మద్యం ఏరులైపారుతుందని జనాలు గోల చేస్తున్నారు. గుండా చట్టాన్ని తెచ్చారు. దీని ప్రకారం శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎలాంటి విచారణలు లేకుండానే ఏడాది పాటు జైలులో ఉచవచ్చు.
దీన్ని కూడా జనాలు వ్యతిరేకిస్తున్నారు. నిజానికి ఇక్కడ క్రైంరేటు చాలా చాలా తక్కువనే చెప్పాలి. కొత్తగా గుండా యాక్టును తేవటంలో ఉద్దేశ్యం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నవారిపై ఉక్కుపాదం మోపటానికే అనేది జనాల ఆరోపణలు. మొత్తానికి ప్రపుల్ కే పటేల్ పెట్టిన చిచ్చుతో ద్వీపమంతా అట్టుడికిపోతోంది. ఇంత జరుగుతున్నా కేంద్రం చోద్యం చూస్తోంది. పైగా తాజాగా సుల్తానాపై రాజద్రోహం కేసు పెట్టడం పుండుమీద కారం చల్లనట్లయ్యింది. మరి పరిస్ధితులు ఎలా చల్లబడుతాయో ఏమో.