శోభాడేకు చెప్పుదెబ్బ లాంటి ఆన్స‌ర్లు

Update: 2016-08-19 11:32 GMT
ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్పుడు అంద‌రి చూపు రియో వైపే ఉంది. ఆయా దేశాలకు చెందిన క్రీడాభిమానులు త‌మ దేశ క్రీడాకారులు ప‌త‌కాలు భారీ ఎత్తున గెలుచుకోవాల‌ని కోటి ఆశ‌ల‌తో క‌ళ్ల‌లో ఒత్తులు వేసుకుని మ‌రీ వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్ర‌తి భార‌తీయుడు నోటి వెంట పీవీ.సింధు పేరే వినిపిస్తోంది. రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం తీసుకొస్తుందని సింధుపై యావత్ భార‌త ప్ర‌జానీకం ఆశ‌లు పెట్టుకుని ఎంతో ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తోంది. ఇక భార‌తీయుల క‌ల‌ల‌ను నెర‌వేర్చేందుకు సింధూ కూడా కొద్ది గంటల్లోనే ఫైన‌ల్ మ్యాచ్ ఆడ‌నుంది. ప్ర‌తి ఒక్క‌రు ఆమెకు సోష‌ల్ మీడియాలో శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

 ఇలాంటి టైంలో ఆమెకు మ‌న దేశానికే చెందిన ఓ ప్ర‌ముఖ వ్య‌క్తి నుంచి ఛీత్కారం ఎదురైంది.  ప్ర‌ముఖ కాల‌మిస్ట్ శోభా డే ట్విట్ట‌ర్‌లో సింధును అవ‌మానించేలా కామెంట్ చేసింది. సింధు సిల్వ‌ర్ ప్రిన్స్ అని తేల్చేయ‌డంతో పాటు ఆమెకు బంగారు ప‌త‌కం తెచ్చే స‌త్తా లేద‌ని పేర్కొంది. శోభా డే కామెంట్ల‌పై దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. శోభా డే ఇంత‌కు ముందు కూడా రియోకు వెళ్లిన ఇండియ‌న్ క్రీడాకారుల‌పై ఇదే త‌ర‌హాలో నెగిటివ్ కామెంట్లు చేసింది.

మ‌న క్రీడాకారులు సెల్ఫీలు తీసుకునేందుకే రియో వెళ్లార‌ని ఎద్దేవా చేశార‌న్న ఆమె ఇప్పుడు కూడా త‌న తీరు మార్చుకోలేదు. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో ఫైనల్ పోరుకు సిద్ధమైన తెలుగు షట్లర్ పీవీ సింధు విషయంలో కూడా ఆమె ఇష్టారాజ్యంగా కామెంట్ చేయడంతో ట్విట్టర్ జనాలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు.

భార‌త మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ శోభా డే శోభా డే అనే పదాలతో ఆమెకు ఘాటుగా త‌న స్పంద‌న తెలియ‌జేశాడు. సాక్షి మెడ‌లో కాంస్యం ఎంతో శోభ‌ను ఇస్తుంద‌ని ట్వీట్ చేశాడు. ఇక బాలీవుడ్ బిగ్ బీ అమితాబ‌చ్చ‌న్ అయితే శోభా పై ప‌ట్ట‌రాని కోపం ప్ర‌ద‌ర్శించారు. అయితే ఆయ‌న నేరుగా ఆమె పేరును ప్ర‌స్తావించ‌కుండా ఆమెకు స‌మాధానం ఇచ్చారు. మీరు దేశానికి మెడ‌ల్స్ తీసుకు వ‌స్తున్నారు..మీతో సెల్ఫీలు తీసుకోవాల‌నుకుంటున్నాం అని సింధును ఉద్దేశించి  ట్వీట్ చేశారు. అలాగే మీరు అతి ప్ర‌సంగం చేసే వాళ్ల నోటికి తాళాలు కూడా వేయించార‌ని.... మ‌న ప‌నులే మాట్లాడ‌తాయి...అవి అప్పుడ‌ప్పుడు పెన్నుల‌ను కూడా ఓడిస్తాయ‌ని ప‌రోక్షంగా శోభ సింధుపై చేసి వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. 
Tags:    

Similar News