ఆస్ట్రేలియా క్రికెటర్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ 2020లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు మాక్స్‌ను రూ. 10 కోట్లు పెట్టి కొన్నది. కానీ అతడు మాత్రం ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా ఆడలేదు. అయితే ఆ వెంటనే ప్రారంభమయిన ఇండియా- ఆస్ట్రేలియా టూర్లో మ్యాక్స్‌వెల్ రెచ్చిపోయి ఆడుతున్నాడు. దీంతో అతడిపై సోషల్‌మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి.
తాజాగా మాజీ క్రికెటర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం మ్యాక్స్‌వెల్‌ను తీవ్రంగా ట్రోల్ చేశాడు. మ్యాక్స్‌వెల్ కేవలం కూల్‌డ్రింక్స్ తాగేందుకు, ఎంజాయ్ చేసేందుకు మాత్రమే ఐపీఎల్‌కు వస్తాడని మండిపడ్డారు. సొంతదేశం తరఫున ఒక్క మ్యాచ్ లో సరిగ్గా ఆడకపోయినా తర్వాత మ్యాచ్‌లో అతడు ఉండడు. కానీ అదే ఐపీఎల్‌లో అయితే ఒక్కసారి డబ్బులు చెల్లించి కొన్నామంటే చివర వరకు అతడిని భరించాల్సిందే. అందుకు మ్యాక్స్‌వెల్ ఇలా చేస్తున్నాడు. మనం రెండు రకాలైన మ్యాక్స్‌వెల్‌ను చూస్తాం. మ్యాక్స్‌వెల్ రెండు రకాలుగా ప్రవర్తిస్తాడని.. తన సొంతదేశం తరఫున ఒకలాగా ఐపీఎల్‌లో మరోలా ఆడతాడని మండిపడ్డారు.ఐపీఎల్ సీజన్లో అతడికి అస్సలు బాధ్యత ఉండదని.. ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తాడని పేర్కొన్నారు.
కాగా ఆరోపణలపై మ్యాక్స్‌వెల్ స్పందిస్తూ.. వీరు చేసిన వ్యాఖ్యలపై నేను మాట్లాడదలచుకోలేదు. ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేయనందుకు అతనికి నాపై కోపం ఉన్నట్టుంది. అతని వ్యాఖ్యలు నన్ను ఏ మాత్రం ఇబ్బంది పెట్టవు’ అని పేర్కొన్నాడు. గత ఐపీఎల్‌లో మ్యాక్స్‌వెల్ మొత్తం 13 మ్యాచ్‌లు ఆడి కేవలం 105 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కానీ ఆస్ట్రేలియా టూర్లో మాత్రం మూడు వన్డేల్లో 167 పరుగులు, మూడు టీ20లలో 78 పరుగులు సాధించాడు. దీంతో అతడిపై విమర్శలు వస్తున్నాయి.