వ్యాపారం అంటేనే సవాలక్ష సవాళ్లతో కూడుకున్నది. వ్యాపారంలో మెళకువలు తెలుసుకున్న వాళ్లు కోట్లకు పడగలెత్తితే.. గుడ్డిగా పాటించేవాళ్లు మాత్రం దివాలా తీయడం ఖాయం. ట్రెండ్ కు తగ్గట్టుగా మార్కెట్ పెంచుకుంటూ పోతేనే వ్యాపారంలో నిలువగలరు. బిజెనెస్ మెన్స్ తమ వ్యాపారం కోసం ఎంతో కష్ట పడుతుంటారు. అయితే అలాంటి వాళ్లందరూ సక్సెస్ అయిన దాఖాలాలు కోటికి ఒకటో రెండో కన్పిస్తాయి. అయితే బిజినెస్ లో కష్టాన్ని కాకుండా స్మార్ట్ గా ఆలోచించే వారు ఏ రంగంలోనైనా రాణించగలుగుతారనే నిజం. అయితే కొందరు వ్యాపారులు తాము చేసే వ్యాపారంలో నష్టాలు రాగానే వాటికి గల కారణాలను పరిష్కరించకుండా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో ఇండియా లో ఆత్మ హత్యలకు పాల్పడుతున్న వ్యాపారుల సంఖ్య గణనీయంగా పెరిగి పోతుండటం ఆందోళన కలిగిస్తోంది.
* నష్టాల సాకుతో బలవన్మరణాలు
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారంగా 2017లో 7,778మంది వ్యాపారులు ఆత్మహత్య చేసుకున్నారు. 2018లో 7,990మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఖ్య గతేడాదికన్నా 2.7శాతం ఎక్కువ. అయితే అనూహ్యంగా జీడీపీ రేటు ఎక్కువగా నమోదు చేసుకున్న రాష్ట్రాల్లోనే ఆత్మహత్యలకు పాల్పడిన వ్యాపారుల సంఖ్య ఎక్కువగా ఉండటం శోచనీయం. కర్ణాటకలో అత్యధికంగా 1,113మంది, మహారాష్ట్రలో 969మంది, తమిళనాడులో 931మంది వ్యాపారాలు ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడైంది. కేవలం వ్యాపారంలో నష్టాలు, దివాళా తీసిందనే కారణంతోనే వీరంతా ఆత్మహత్యలకు పాల్పడినట్లు ఎన్సీఆర్సీ తన నివేదికలో పేర్కొనడం గమనార్హం.
* కుటుంబ కలహాలతో..
వ్యాపారులు ఆత్మహత్యల్లో రెండో కారణం కుటుంబ కలహాలని తెలుస్తోంది. 2017లో కుటుంబ కలహాలతో 30.1శాతం మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ శాతం 2018నాటికి 30.4శాతానికి పెరిగింది. ఆర్థిక ఇబ్బందులే కుటుంబ కలహాలకు దారి తీస్తున్నాయి. హెల్త్ సమస్యలతో 17.7శాతంమంది, పెళ్లి సంబంధ కారణాలతో 6.2శాతం, డ్రగ్స్ కారణాలతో 5.3శాతం, లవ్ ఫెయిల్యూర్ వంటి కారణాలతో 4శాతం మంది వ్యాపారులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు ఎన్సీఆర్సీ తన నివేదికలో వెల్లడించింది. వ్యాపారాల్లో దివాళా కారణం గా రోజుకు 13మంది వ్యాపారులు చనిపోతున్నారని పేర్కొంది. మహారాష్ట్రలో 1,541, కర్నాటకలో 1,391, బెంగూళూరు లో 142మంది వ్యాపారంలో దివాళా కారణంగా ఆత్మ హత్యలు చేసుకున్నారు. రోజుకు సగటున 13మంది వ్యాపారులు ఆత్మ హత్యలు పాల్పడుతున్నరని ఎన్సీఆర్సీ పేర్కొంది.
వ్యాపారంలో నష్టాలను ఎలా ఎదుర్కోవాలో తెలియకే చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాగే వ్యాపారం దివాలా తీసేందంటే అవమానంగా భావిస్తున్నారు. తమ బంధువులు, స్నేహితుల ముందు ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందోనని భయంతోనే ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్యలకు పాల్పడుతున్నాయి. అలా కాకుండా నష్టాలు వచ్చినపుడు వ్యాపారులు తమ ఖర్చులను తగ్గించుకొని ఎందువల్ల నష్టాలు వస్తున్నాయో గ్రహించి నష్ట నివారణ చర్యలు తీసుకుంటే గట్టెక్కించవచ్చు. మార్కెట్ తగ్గట్టుగా బిజినెస్ వ్యూహాలను అవలంబిస్తేనే విజయం దక్కుతుంది. అందరూ ఒకే పంథాలో వెళితే ఎవరో ఒకరికి మాత్రమే విజయం దక్కుతుంది. మార్కెట్ కు అనుగుణంగా తమ వ్యాపారంలో మెలకువలు పాటిస్తే తప్పకుండా ఈ రంగంలో సక్సస్ సాధించవచ్చు. బిజినెస్ మెన్స్ తాము అనుకున్న గోల్ కోసం నిరంతరం కృషి చేయాలి తప్పా.. సెల్ప్ గోల్ కావద్దని పలువురు సూచిస్తున్నారు. ఒక్క స్మార్ట్ ఆలోచన చాలు ఎంత దివాళా తీసిన వ్యాపారాన్ని గట్టెక్కించడానికి.. వ్యాపారులు ఆ దిశగా ఆలోచించి ఆత్మ హత్యలకు దూరంగా ఉండాలని కోరుకుందాం.