'నా భార్య మంచిది కాదు.. స‌హ‌జీవ‌నం చేయొద్దు' హైద‌రాబాద్ వాసి సెల్ఫీ సూసైడ్‌

Update: 2022-11-14 02:30 GMT
''నా భ‌ర్య మంచిది కాదు. ఆమెతో స‌హ‌జీవ‌నం చేయొద్దు'' అని పేర్కొంటూ హైద‌రాబాద్‌కు చెందిన ఒక వ్య‌క్తి సెల్ఫీ తీసుకుంటూ.. ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. కొన్నాళ్లుగా ఆయ‌న భార్య వేరే వ్య‌క్తితో స‌హ‌జీవ‌నం చేస్తోంది. మ‌రొక‌రితోనూ వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విష‌యాల‌పై అనేక సార్లు పంచాయితీలు జ‌రిగినా ఆమె మార‌లేదు. దీంతో చివరకు సెల్ఫీ వీడియో తీసుకుని.. బలవన్మరణానికి పాల్పడ్డాడు.

రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ రు చెందిన గూడూరు శేఖర్.. ఓ మహిళను 2014లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కూమార్తె, కుమారుడు ఉన్నారు. `ఆమె` హైదరాబాద్ లోని కేంద్ర సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయంలో పని చేస్తూ.. ఈ ఏడాది జనవరిలో ఆదిలాబాద్ కు బదిలీ అయింది. అయితే ఆమె హైదరాబాద్ లో పనిచేస్తున్న సమయంలో నాబార్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న అధికారితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే వారు చనువుగా ఉండటం భర్త శేఖర్ గమనించాడు. అది తప్పు అని శేఖర్ ఆమెను మందలించాడు.

దీనిపై అనేక పంచాయితీల అనంత‌రం తన తప్పు ఒప్పుకుని.. పెద్దల సమక్షంలో భవిష్యత్తులో అలాంటి తప్పులు పునరావృతం కావని క్షమాపణ కోరింది. ఆ తర్వాత కొంతకాలం వారి కాపురం సజావుగా సాగింది. ఈ క్రమంలోనే ఆమె మళ్లీ  స‌ద‌రు మేనేజ‌ర్‌తో కలిసి ఆదిలాబాద్ లో సహజీవనం చేస్తోందనే విషయాన్ని భర్త శేఖర్ తెలుసుకున్నాడు. అక్క‌డ‌కు వెళ్లి నిల‌దీశాడు. అయితే.. ఈ క్ర‌మంలోనే మ‌రో వ్య‌క్తితోనూ `ఆమె` వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న‌ట్టు తెలిసింది.

 దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శేఖర్.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే  సెల్ఫీ వీడియో తీసుకుని విషం తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తమ కుమారుడి చావుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకొని.. తమకు న్యాయం చేయాలని బాధితుడి తండ్రి పోలీసులను కోరారు. అయితే, సెల్ఫీ వీడియోలో మాత్రం.. త‌న భార్య మంచిది కాద‌ని.. ఆమెతో వివాహేత‌ర సంబంధం వ‌ద్ద‌ని శేఖ‌ర్ చెప్ప‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది.
Tags:    

Similar News