స్పెర్మ్ హోలీ.. నిజమా? కాదా?

Update: 2018-03-03 05:41 GMT
దిల్లీలో హోలీ వేడుకల్లో యువకులు శ్రుతి మించారని.. అమ్మాయిలపై రంగులకు బదులు వీర్యం చల్లారని ఆరోపణలు వచ్చాయి. బెలూన్లలో వీర్యం నింపి వాటిని అటుగా వస్తున్న లేడీ శ్రీరాం కాలేజి విద్యార్థిపై విసిరారన్నది సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, అలా చేయడం అసాధ్యం అంటూ ట్వీటర్ వేదికగా ఓ వ్యక్తి తన లాజిక్ వినిపించారు. అదికూడా ఇప్పుడు వైరల్ గా మారింది.
    
బెలూన్లలో వీర్యం సాధ్యం కాదంటూ.. కాగా, ఈ దాడిని నిరసిస్తూ ఓ వ్యక్తి తన ట్విట్టర్‌ లో పోస్టు చేశారు. ‘అసలు అంత స్థాయిలో వీర్యాన్ని సేకరించటం సాధ్యమయ్యే పని కాదు. ఆరోగ్యవంతమైన మానవుడు 5 మిల్లిలీటర్ల కన్నా ఎక్కువ వీర్యాన్ని స్కలించలేడు. ఒకవేళ అంతస్థాయిలో సేకరించినా అది ఎంతో సేపు లిక్విడ్‌ స్టేజీలో ఉండలేదు. వాటిని నిల్వ చేయాలంటే ప్రత్యేక పరికరాల్లో నింపాల్సి ఉంటుంది' అని ఆయన తన ట్వీట్ లో విశ్లేషించారు. ఒకవేళ ‘ఆ బెలూన్లలో నీటిని కలిపి నింపారనుకున్నా.. దాని తత్వాన్ని అది కోల్పోతుంది. పైగా అసలు దానిని బెలూన్లలో నింపటం కుదిరే పని కాదు. పోనీ.. ద్రవరూప నైట్రస్‌ ఆక్సైడ్‌ తో దానిని నింపారనుకున్న అందుకు ఆస్కారమే లేదు' అంటూ పలు కారణాలను వివరించారు.  ‘ది గుడ్‌ డాక్టర్‌' పేరిట ఆ ట్విట్టర్‌ ఖాతా ఉంది. పైగా అందులోని వ్యక్తి వైద్యుల మాస్కులు ధరించి ఉండటంతో బహుశా ఆతనో వైద్యుడయి ఉంటాడని భావిస్తున్నారు. ఈ ట్వీట్లకు పలువురు మద్దతు పలుకుతుండగా - మరికొందరు మాత్రం ఖండిస్తున్నారు.
    
కాగా వీర్యంతో నింపిన బెలూన్లను వారిపై విసిరిన ఆకతాయిలను కఠినంగా శిక్షించాలంటూ ఇప్పటికే నిరసనలు చేపట్టారు. ఢిల్లీ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ ముందు వివిధ కళాశాలల విద్యార్థినులు ధర్నాకు దిగారు. జాతీయ మహిళా కమీషన్‌ సైతం ఈ వ్యవహారంపై మండిపడటంతో పోలీసులు సీరియస్‌ గా దర్యాప్తు చేపట్టారు. 
Tags:    

Similar News