ప్రజా ప్రతినిధులుగా ఉన్న వ్యక్తులు సంయమనం కోల్పోతే ఏం జరుగుతుందో తెలియజెప్పేందుకు ఇదే ఉదాహరణ. ఇండియన్ ఎయిర్ లైన్స్ ఉద్యోగిని చెప్పుతో కొట్టడం ద్వారా వార్తల్లో కెక్కిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ పరిస్థితి కడు దీనంగా మారింది. తన దురుసు ప్రవర్తన కారణంగా ఇప్పుడు విమానప్రయాణం చేయలేక నిరాశానిస్పృహలకు లోనయ్యారు. గైక్వాడ్ ఏడు రోజుల్లో ఏడుసార్లు విమాన ప్రయాణం చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు.
పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో గత మంగళవారం నుంచి ఆయన ఇలా అయిదుసార్లు ఢిల్లీ వెళ్లడానికి విఫలయత్నం చేశారని సమాచారం. అంతేకాకుండా గత టికెట్లను సైతం రద్దు చేసింది. కొత్త టికెట్లలో మూడుసార్లు తన వద్ద ఉన్న ఓపెన్ టికెట్లను ధ్రువీకరింప చేసుకోవడానికి, రెండుసార్లు కొత్త టికెట్లు కొనడానికి ప్రయత్నించారు. ఇందుకోసం తన పేరును రెండు రకాలుగా పేర్కొన్నారు. ఒకసారి రవీంద్ర గైక్వాడ్ గా - మరోసారి ప్రొఫెసర్ వి రవీంద్ర గైక్వాడ్ గా తన పేరును పేర్కొన్నారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. ఎయిరిండియా దీన్ని పసిగట్టి, కొత్తగా టికెట్లు బుక్ చేసుకోవడానికి అనుమతించలేదు. ఇదివరకే తీసుకున్న టికెట్లను రద్దు చేసింది. దీంతో పాటు ఢిల్లీ నుంచి పుణె వెళ్లడానికి గైక్వాడ్ ఇదివరకే తీసుకున్న రెండు టికెట్లను గత శుక్రవారం (మార్చి 24న) రద్దు చేశారు. వీటిలో ఒక దాన్ని ఎయిరిండియా రద్దు చేయగా, మరోదాన్ని ఇండిగో రద్దు చేసింది. మొత్తం మీద గైక్వాడ్ గత శుక్రవారం (మార్చి 24) నుంచి గురువారం (మార్చి 30) వరకు విమాన ప్రయాణం చేయడానికి ఏడుసార్లు విఫలయత్నం చేశారు.
ఎయిరిండియా ఉద్యోగిని సాండల్స్ తో కొట్టిన ఎంపీ గైక్వాడ్.. దానిపై ఇప్పటి వరకు కనీసం విచారం కూడా వ్యక్తం చేయలేదని ఎయిర్ ఇండియా అధికారి పేర్కొన్నారు. `విమానయాన సంస్థలు గైక్వాడ్ కు కొత్త టికెట్లు ఇవ్వలేదు. ఇదివరకే తీసుకున్న ఓపెన్ టికెట్లను ధ్రువీకరించలేదు. గైక్వాడ్ వద్ద ఎన్ని ఓపెన్ టికెట్లు - ఎన్ని తరచుగా ప్రయాణించే టికెట్లు ఉన్నాయో అంచనా వేస్తున్నాం. తద్వారా వాటిని రద్దు చేయడానికి వీలు కలుగుతుంది` అని ఎయిరిండియా అధికారి వివరించారు. గైక్వాడ్ ను విమాన ప్రయాణం చేయడానికి అనుమతించ కూడదనే ఆదేశాలను తాము ఇప్పటికే జారీ చేశామన్నారు. అతను తన వద్ద ఉన్న ఓపెన్ టికెట్లతో విమాన ప్రయాణం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, ఫలితం పొందలేరని ఆ అధికారి పేర్కొన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/