రామ మందిరంపై సేన కామెంట్ అదిరింది

Update: 2015-12-25 15:50 GMT
అయోధ్య‌లో రామ‌మందిరం....దేశ‌వ్యాప్తంగా ఇపుడు చ‌ర్చ‌నీయాంశంగా మారిన అంశ‌మిది. రామమందిరం నిర్మించి తీరుతామ‌ని హిందూవాదులు చెప్తుండ‌గా...ఇపుడెలా చేప‌డుతార‌ని ఎంఐఎంతో పాటు కాంగ్రెస్‌ - లెఫ్ట్ పార్టీలు ప్ర‌శ్నిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌రాఠాల అగ్గిబ‌రాఠ శివ‌సేన త‌న‌దైన శైలిలో స్టేట్‌ మెంట్ ఇచ్చింది. త‌న అధికారిక‌ప‌త్రిక సామ్నా ద్వారా సేన‌ వాదన‌ను వినిపించింది.

అయోధ్య‌లో రామ‌మంది నిర్మాణాన్ని జాతీయ కార్యక్రమంగా శివసేన అభివర్ణించింది. శ్రీరామ చంద్రుడి ఆశీస్సుల బలంతో అధికారంలోకి వచ్చామని చెప్పుకునే వారు ఇప్పటికైనా రాముడికి రామజన్మభూమిలో మందిరం నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని సామ్నా సంపాదకీయం పేర్కొంది. శుక్రవారం నాటి సంపాదకీయంలో సామ్నా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి పెట్టుకున్న‌ తేదీని ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అయోధ్యలో రామమందిర నిర్మాణంపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందని, రామమందిర నిర్మాణం కోసం ఇటుకలు కూడా రాష్ట్రానికి చేరాయని సామ్నా ప్ర‌స్తావించింది. అయితే మరో రెండేళ్లలో మళ్లీ యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయనీ, అయినా రామమందిర నిర్మాణం విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని సామ్నా వ్యాఖ్యానించింది.  ప్రస్తుతం శ్రీరామ చంద్రమూర్తి వెలివేసినట్లుగా ఒక తాత్కాలిక టెంట్ వంటి మందిరంలో కొలువుదీరి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ...అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలని శివసేన అధికారిక పత్రిక స్ప‌ష్టం చేసింది.
Tags:    

Similar News