ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ జనసేనాని - పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు సినీ పరిశ్రమ నుంచి ఎవరు మద్దతుగా ఉంటారనే చర్చ మొదలైంది. పవన్ ఎప్పుడెప్పుడు ఊ అంటాడా, ఎప్పుడు ఆయన పార్టీలో చేరిపోదామా అనే వాళ్లకి కొదవే లేదు. రాజకీయ నాయకుల్లోనే గాక సినీ పరిశ్రమలో ఉంటూ రాజకీయాలంటే ఆసక్తిగల వాళ్ల కూడా వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ వెటరన్ హీరో నరేష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నా యి. పవన్ ను ఆయన పొగడ్తలతో ముంచెత్తిన విధానం.. అందరినీ ఆశ్చర్యం కలిగిస్తోంది. నాడు ఎన్టీఆర్ తర్వాత అం తటి స్థాయిలో సుపరిపాలన అందించడం పవన్‌కే సాధ్యమంటూ ఆకాశానికి ఎత్తేయడం సరికొత్త చర్చకు తెర తీసింది!
ఏపీ రాజకీయ చరిత్రలో నాటి సీనియర్ ఎన్టీఆర్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతాకాదు. పేదవాడికి ఉపయోగ పడేలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఆయన్ను ఎవరూ మరిచిపోరు. మరి అదంతా స్వర్ణయుగమని పేదలంతా గుర్తుచేసుకుంటారు. ఇప్పుడు అదే స్వర్ణయుగం పవన్ తోనే వస్తుందని సీనియర్ నటుడు నరేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు రాజకీయంగానూ - ఇటు సినిమా రంగంలోనూ చర్చనీయాంశంగా మారాయి. విశ్వనటుడు కమల్ హాసన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన నరేష్.. అనంతరం ట్విటర్ లో ఈ కామెంట్లు చేశారు. అంతేగాక పవన్ - కమల్ హాసన్ పై పొలిటికల్ ఎంట్రీపై - సీఎం అవకాశాలపై ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు.
`పవన్ కల్యాణ్ - కమల్ హాసన్ ను తమ అభిమానులు - ప్రజలు ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే ఎంజీఆర్ - ఎన్టీఆర్ హయాంలోని స్వర్ణయుగం మళ్లీ వచ్చినట్టే` అని ట్వీటారు! అయితే పవన్ ను ఎన్టీఆర్ తో పోల్చడంతో అభిమానులందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. పవన్ అభిమానులు మాత్రం నరేష్ వ్యాఖ్యలపై ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే పవన్ పై ఆయన ప్రశంసలు కురిపించడానికి కారణం కూడా లేకపోలేదనే వాదన మొదలైంది.