ప‌ద‌వి వ‌ద్దు.. స‌భ్య‌త్వం చాల‌న్న సీనియ‌ర్ న‌టి!

Update: 2018-05-04 11:43 GMT
రాజ‌కీయం అన్న దాని ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌నంత‌నే లౌక్యం వ‌చ్చేస్తుందేమో?  రాజ‌కీయాల మీద అవ‌గాహ‌న లేదు. డ‌బ్బులు కూడా  పెద్ద‌గా లేవు. రాజ‌కీయంగా ప‌రిచ‌యాలు కూడా పెద్ద‌గా లేవు. అంటూ మాట‌లు చెప్పిన సీనియ‌ర్ న‌టి సంగీత మాట‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి.

ఏమీ అక్కర్లేదు.. తెలంగాణ అధికార‌పార్టీలో స‌భ్య‌త్వం చాలంటూ సింఫుల్ గా చెబుతున్న ఆమె మాటల్నికాస్త లోతుగా వెళితే.. ఆమె అస‌లు టార్గెట్ క‌నిపించ‌ట‌మే కాదు.. ఆమె తెలివికి ఫిదా కావాల్సిందే. సీనియ‌ర్ న‌టిగా సుప‌రిచితురాలైన సంగీత ఇటీవ‌ల టీఆర్ ఎస్ పార్టీలో చేరుతున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రిగింది.

ప్ర‌చారాన్ని ప‌క్క‌న పెట్టి.. ఆమెనే ఈ విష‌యాన్ని నేరుగా అడిగేస్తే.. ఆమె రియాక్ట్ అయ్యారు.నిజ‌మే.. తాను టీఆర్ ఎస్ పార్టీలో చేరాల‌ని భావిస్తున్న‌ట్లు చెప్పారు. కాకుంటే.. త‌న‌కు ప‌ద‌వులు ఏమీ అక్క‌ర్లేద‌ని.. పార్టీ స‌భ్య‌త్వం ఇస్తే చాల‌న్నారు. అంతేనా అంటే.. అవునన్న ఆమె.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చి సినిమా ఇండ‌స్ట్రీకి ఏమైనా చేయాల‌ని తాను అనుకుంటున్న‌ట్లు చెప్పారు.

పేద క‌ళాకారుల‌కు ప్ర‌భుత్వ సాయం అందేలా ఏదైనా చేస్తే బాగుంటుంద‌న్న భావ‌న‌లో ఉన్న‌ట్లు ఆమె చెప్పారు. త‌మ‌ది వ‌రంగ‌ల్ అని.. తానీ మ‌ధ్య ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను క‌లిసి.. సినీ క‌ళాకారుల‌కు ఏదైనా ప్ర‌భుత్వ ప‌రంగా చేస్తే బాగుంటుంద‌ని చెప్పాన‌ని చెప్పారు. పార్టీలో చేరాల‌ని తాను అనుకున్న‌ది నిజ‌మేన‌ని.. కానీ నిర్ణ‌యం తీసుకోలేద‌న్నారు. నిర్ణ‌యం తీసుకోలేదా?  లేక‌.. కేసీఆర్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రాలేదా..?
Tags:    

Similar News