జనసేన పార్టీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. తను ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినట్టుగా ఇప్పుడు పవన్ కల్యాణ్ చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఆరు నెలల కిందటి వ్యవహారం గురించినే పవన్ జనాలను అప్పుడే తప్పుదోవ పట్టించాలని చూస్తూ ఉండటం గమనార్హం.
ఉభయ కమ్యూనిస్టు పార్టీలతోనూ, బీఎస్పీని కలుపుకుపోయి పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీ చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయవతిని ప్రచారానికి సైతం పిలిపించుకున్నారు. ఆమెతో ప్రచారం చేయించుకుని దళిత ఓటు బ్యాంకుకు పవన్ గురి పెట్టారు. అయితే ఆ ప్లాన్లేవీ వర్కవుట్ కాలేదు.
ఎన్నికలు అయిపోయిన ఆరు నెలల తర్వాత ఇప్పుడు పవన్ కల్యాణ్ వారెవరితోనూ తనకు సంబంధం లేనట్టుగా చెబుతున్నారు. అలాగే అంతకు మించిన విషయం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాను పవన్ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ దేశానికి అమిత్ షానే సరైన నేత అంటూ ఇటీవల పవన్ వ్యాఖ్యానించారు.
పవన్ తన అవకాశవాదం కొద్దీ ఎప్పుడు ఏ మాట అయినా మాట్లాడగల ఘనుడు. ఎన్నికల ముందు బీజేపీని విమర్శించింది ఈయనే. ఇప్పుడు బీజేపీనే రైటు అంటున్నదీ ఈయనే. ఈ నేపథ్యంలో జనసేన తీరుపై కమ్యూనిస్టు నేతలు మండి పడుతున్నారు. ఇప్పటికే పవన్ తీరును రామకృష్ణ, మధులాంటి మొన్నటి సన్నిహితులు విమర్శించగా, తాజాగా సీనియర్ నేత రాఘవులు కూడా పవన్ తీరును విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ, జనసేనలు భారతీయ జనతా పార్టీ మద్దతుదారులుగా మారాయని ఆయన విమర్శించారు. మొత్తానికి పవన్ తీరుతో కమ్యూనిస్టులు బాగానే అవాక్కయినట్టుగా ఉన్నారు!