రాజకీయ ప్రత్యర్థుల పట్ల రాజకీయ నాయకులు ఎంత అలెర్ట్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ ప్రత్యర్థులనే కాదు.. వారి దగ్గరి బంధువులను కూడా దగ్గరకు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవటం కామన్. ఇక.. కీలక పదవుల్ని అప్పజెప్పాల్సి వస్తే.. అర్హత ఉన్నా ఏదో సాకు చూపించి పక్కకు పెట్టటం మామూలే. ఇందుకు భిన్నంగా వ్యవహరించారు ప్రధాని నరేంద్రమోడీ.
తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అల్లుడు ఏకే పట్నాయక్ కు అత్యంత కీలక విభాగాల్లో ఒకటైన నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ బాధ్యతను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిఘా విభాగాలకు.. చట్టాలను అమలు చేసే సంస్థలకు ఆన్ లైన్ సమాచారాన్ని అందించే బాధ్యతను నాట్ గ్రిడ్ తీసుకుంటుంది.
ఇంతటి కీలకమైన స్థానంలో తన ప్రత్యర్థికి చెందిన ఇంటి అల్లుడికి బాధ్యత అప్పగించేందుకు ఏ ప్రధాని అయిన వెనుకాడతారు. కానీ.. అందుకు భిన్నంగా మోడీ మాత్రం ఆయనకు గ్రిడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకోవటం విశేషంగా చెప్పాలి. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. మోడీ ఇంతటి నిర్ణయం తీసుకోవటానికి కారణం ఆయనకున్న నమ్మకమా? లేక.. మన్మోహన్ సింగ్ అల్లుడి కమిట్ మెంట్ కు సంబంధించిన ట్రాక్ రికార్డా..?