తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు కమ్ తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు బీజేపీనేత మేరుగు రాజు. ముఖ్యమంత్రి పదవి నుంచి కేసీఆర్ ను తప్పించాలని.. ఆయన స్థానంలో తనను సీఎం చేయాలని ఆయన సీరియస్ గా కోరినట్లుగా పేర్కొన్నారు. అయితే.. ఇదంతా జరిగింది మూడేళ్ల క్రితం అంటూ అప్పటి ముచ్చటగా ఇప్పుడు చెప్పుకొచ్చారు.
కేంద్ర మంత్రి అమిత్ షాను మంత్రి హరీశ్ కలిశారని.. తనకు 30 -35 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. తనను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలని హరీశ్ కోరినట్లు చెప్పారు. దీనికి సంబంధించిన ఆధారాల్ని సరైన సమయంలో తాను బయటపెడతానని వ్యాఖ్యానించారు. హరీశ్ కు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలు ఎవరికి కూడా కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయటం ఏ మాత్రం ఇష్టం లేదన్నారు.
ఆ మాటకు వస్తే.. హరీశ్ చేస్తున్న ప్రయత్నాల్ని అడ్డుకున్నది అప్పటి మంత్రి ఈటల రాజేందర్ అని చెప్పారు. కేసీఆర్ ను సీఎం పదవి నుంచి దింపేయాలన్న ప్రయత్నం ఏ మాత్రం సరికాదని హరీశ్ ను అడ్డుకున్నారని పేర్కొన్నారు. సరైన సమయం కోసం హరీశ్ ఎదురుచూస్తున్నారని.. కల్వకుంట్ల కుటుంబాన్ని దెబ్బ తీసేందుకు వీలుగా హరీశ్ కాచుకొని ఉన్నట్లుగా వ్యాఖ్యానించారు. మరింత ఘాటైన ఆరోపణలు చేసిన బీజేపీ నేత మాటలకు మంత్రి హరీశ్ ఏమని బదులిస్తారో చూడాలి.