కొన్ని రోజులుగా వైసీపీ నేతల వివాదాలు తారస్థాయికి చేరుతున్న విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణిని కార్నర్ చేసుకుని వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు.. గ్రామస్థాయికి చేరిపోయాయి. ఏ ఇద్దరు మహిళలు కలిసినా.. చంద్రబాబు కుటుంబంపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై చర్చించు కుంటున్నారు. రాజకీయాలు భ్రష్టు పట్టిస్తున్నారని.. బుగ్గలు నొక్కుకుంటున్నారు. ఇది క్షేత్రస్థాయిలో తీవ్రస్థాయిలో చర్చకు వస్తోంది. ఇది వైసీపీ సర్కారుకుపెను ప్రమాదంగా మారింది. ఎందుకంటే.. ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతుండడమే. సున్నితమైన.. మహిళల అంశాన్ని వీధికెక్కించడమే కారణమని.. వైసీపీ నేతలే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.
ఒక మీడియా చానెల్‌తో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. చంద్రబాబు కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తర్వాత ఆయన క్షమాపణలు చెప్పినా.. ఈ విషయంలో వైసీపీకి జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. ఇక, అసెంబ్లీ వేదికగా.. వైసీపీ ఎమ్మెల్యేలు.. ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, అంబటి రాంబాబులు తీవ్ర వ్యాఖ్యలే చేశారు. చంద్రబాబు సతీమణిపై వ్యాఖ్యలు సంధించారు. దీనిపైబాబు కన్నీరు పెట్టుకున్న విషయం కూడా తెలిసిందే. తర్వాత ఈ ఘటటనను గ్రామస్థాయికి కూడా తీసుకువెళ్లి.. వైసీపీ మహిళల విషయంలో ఎంత దారుణంగా వ్యవహరిస్తోందో.. వివరించారు.
ఇక, ఈ పరిణామంపై వైసీపీలోనూ చర్చ సాగింది. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలు.. టీడీపీ అధినేత సతీమణికి క్షమాపణలు చెప్పారు. కన్నీటితో పాదాలు కడుగుతామన్నారు. మరి ఎంత తీవ్రస్థాయిలో ఈ పరిణామం.. ప్రభావం చూపించిందో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఈ క్రమంలో నే తాజాగా . ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు సోమిశెట్టి సుబ్బారావు గుప్తా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీలు వైసీపీకి మిత్రులో, శత్రువులో అర్థం కావడం లేదు. వారి వల్ల పార్టీకి 20 శాతం ఓట్లు పోయే ప్రమాదం ఉంది. ఇలాగే వ్యవహరిస్తే పార్టీకి తీవ్ర నష్టం ఖాయం. ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే కర్రలు తీసుకొని వెంటబడి కొడతారు’’..అని వ్యాఖ్యానించారు.
ఈ నెల 12న ఒంగోలులో మంత్రి బాలినేని జన్మదిన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గుప్పా.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేతలు తీరు మార్చుకోకపోతే పార్టీకి భారీ నష్టమని, ఓడిపోతే కార్యకర్తలు ఇబ్బందులు పడతారని అన్నా రు. ‘‘ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి పెద్ద వీరుడంటారు. అప్పట్లో 35 వేలతో ఓడిపోయాడు. మొన్న జగనన్న వేవ్‌తో మళ్లీ గెలిచాడు. జనసేన పార్టీ ఆడవాళ్ల జోలికిపోయాడు. చివరకు విజయసా యిరెడ్డిని కొట్టేకాడికి జనసేన పార్టీ వాళ్లు వచ్చారంటే మనం చేసిన చెడ్డ పనులు వల్లనే. పార్టీలో ఉంటూ కొంతమంది వ్యవహరిస్తున్న తీరు పార్టీకి మిత్రులా, శత్రువులా, కోవర్టు ఆపరేషనా అనేది అర్థం కావడం లేదు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని పనిచేస్తే పార్టీతో పాటు అందరికీ మేలు జరుగుతుంది. `` అన్నారు.
అదేసమయంలో పార్టీపైనా గుప్తా వ్యాఖ్యలు చేశారు. ``సమర్థులకు పదవులు లేవు వాసన్నా (బాలినేని).. నీ చుట్టూ తిరుగుతూ పొగడేవాళ్లకే ఇస్తున్నారు. నీ వెంట ఉన్నవారినే నాయకులు, కార్యకర్తలుగా గుర్తిస్తున్నా రు. నీకోసం కష్టపడి పనిచేసిన వారిని విస్మరిస్తే భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి. పార్టీలో ఉంటూ మీకు చెప్పేందుకు భయపడుతున్నారు. నాకు ఎలాంటి భయంలేదు. ఇప్పటికైనా తెలుసుకొని మేల్కోవాలి.`` అని చెప్పారు. పార్టీని కాపాడుకునేందుకు ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చొరవ తీసుకొకపోతే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని గుప్తా వ్యాఖ్యానించారు. మరి దీనిపై జగన్ ఎలా రియాక్ట్ అవుతారోచూడాలి.