హైదరాబాద్ శివారులో చోటు చేసుకున్న ఒక గొడవ కలకలం రేపుతోంది. మహా అయితే మాటలతో పోయే అంశాన్ని చేతల వరకు తీసుకురావటం.. అది కాస్తా చినికి చినికి గాలివానలా మారటమే కాదు.. రెండు ప్రాణాలు అపాయ స్థితిలో ఉన్న దుస్థితి. బీరు తాగటానికి వెళ్లిన కుర్రాళ్లకు సదరు బార్ వెయిటర్ కు మధ్య మొదలైన లొల్లి పెద్ద గొడవకు దారి తీసింది. అనంతరం చోటుచేసుకున్న పరిణామాల్ని చూస్తే.. సినిమాల్లో మాత్రమే కనిపించే ఈ దౌర్జన్యకాండ గురించి తెలిసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే..
బోడుప్పల్ ఈస్ట్ హనుమాన్ నగర్ కు చెందిన సాయి కృష్ణ, సాయిరాంలు స్నేహితులు. వారిద్దరు మద్యం సేవించేందుకు సోమవారం రాత్రి ఉప్పల్ డిపో సమీపంలోని ‘దర్బార్’ బార్ కు వెళ్లారు. బిల్లు చెల్లించే విషయంలో వీరికి వెయిటర్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు చేయి చేసుకోవటం ఒక ఎత్తు అయితే.. అనంతరం బార్ సిబ్బంది మూకుమ్మడిగా దాడి చేయటంతో వీరిద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇంతకీ సాయి కృష్ణ, సాయిరాంలు చేసిన తప్పేమిటంటే.. మద్యం ధరల్లో ఉన్న వ్యత్యాసాన్ని ప్రశ్నించటమేనని చెబుతున్నారు. పరిగెడుతున్నా కొట్టటంతోపాటు.. ఇదేం అన్యాయమని ప్రశ్నించటానికి వచ్చిన కుటుంబ సభ్యుల మీదా దర్బార్ సిబ్బంది విరుచుకుపడట గమనార్హం.
తీవ్రంగా గాయపడిన వీరిద్దరిని బార్ పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే.. దాడికి పాల్పడిన బార్ సిబ్బంది.. మళ్లీ ఆసుపత్రికి వెళ్లి గాయాలబారిన పడిన ఈ ఇద్దరిని మరోసారి చితకబాదారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సాయి క్రిష్ణ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.దీంతో..అతడ్ని ఉప్పల్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లి దాడి చేసిన సందర్బంలో సాయిరాం.. సాయి క్రిష్ణలతోపాటు వారి స్నేహితులపైనా దాడి చేశారు. అంతేకాదు.. అక్కడ వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన వైద్య సిబ్బంది మీదా చేయి చేసుకున్న వైనంపై విస్మయం వ్యక్తమవుతోంది.
దీంతో.. ఈ దౌర్జన్యకాండకు నిరసనగా దర్బార్ బార్ ముందు మంగళవారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. బార్ అనుమతుల్ని రద్దు చేయాలని.. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జరిగిన ఉదంతం గురించి సమాచారం అందుకున్న బార్ నిర్వాహకులు అక్కడికి రావటంతో.. వారిపై బాధితుల వర్గాల వారు దాడికి ప్రయత్నం చేశారు. అయినా.. కస్టమర్లను ఇంతలా కొట్టటమా?అని ప్రశ్నిస్తున్నారు. ఒకసారి దాడి చేసిన తర్వాత.. ఆసుపత్రిలో వైద్యం చేసుకుంటున్న వారి మీద మళ్లీ దాడి జరగటాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఇదిలా ఉంటే.. బార్ నిర్వాహకులు.. సిబ్బంది ఏడుగురిపైనా మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిని రిమాండ్ కు తరలించారు. బార్ ను సీజ్ చేసేందుకు.. చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు సంబంధిత వర్గాలకు లేఖ రాసినట్లుగా ఏసీపీ శ్యాం ప్రసాద్ రావు పేర్కొన్నారు.