పాతాళానికి పడిన ‘‘డ్రాగన్’’..భారత్ కూ షాకే

Update: 2016-01-04 10:45 GMT
చైనా స్టాక్ మార్కెట్లో ఏర్పడిన అనిశ్చితి.. భారీ పతనం ప్రభావం భారత స్టాక్ మార్కెట్ పైనా తీవ్ర ప్రభావం పడింది. చైనా స్టాక్ మార్కెట్ ప్రభావంతో భార‌త స్టాక్ మార్కెట్ కుదేలైంది.. ఏకంగా సెన్సెక్స్ 537.55 పాయింట్లు న‌ష్టపోగా, నిప్టి 171.90 పాయింట్లు న‌ష్టపోయింది.. దీంతో అన్ని ర‌కాల షేర్ లు బేర్ మ‌న్నాయి.. చైనా స్టాక్ మార్కెట్ ఒక‌టో తేది నుంచి న‌ష్టాల బాట‌నే ప‌య‌నిస్తుంది.. దీనికి తోడు ఆ దేశంలో గ‌త ఆగ‌స్ట్ లో విధించిన లిస్టెడ్ కంపెనీల‌పై అమ్మకాల నిషేధాన్ని ఎత్తి వేశారు.. దీంతో ఒక్కసారిగా ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు.. దీంతో చైనా స్టాక్ మార్కెట్ ఏడు శాతం మేర‌కు ప‌త‌న‌మైంది.. దీంతో సోమవారం ఏకంగా అక్కడ స్టాక్ మార్కెట్ కార్యక‌లాపాల‌ను నిలిపివేశారు.. చైనా ప్రభావం భారీగా భార‌త్ స్టాక్ మార్కెట్ పై ప‌డింది.

 సోమవారం ట్రేడింగ్‌ మొదలయ్యాక డ్రాగన్‌ పరిణామాల ప్రభావం భారత మార్కెట్‌ మీద పడింది. ఒకదశలో సెన్సెక్స్‌ 300 పాయింట్లు కోల్పోయింది. అనంతరం ఇది 400కు చేరుకోగా.. మధ్యాహ్న సమయానికి 500 మార్క్‌ దాటేసింది. మధ్యాహ్నం 2.20గంటల సమయానికి సెనెక్స్‌ 550 పాయింట్లు పతనం కాగా చివ‌రకు కొద్దిగా పుంజుకుని 537.55 న‌ష్టంతో ఆగింది. నిఫ్టీ 171.90 పాయింట్లు కోల్పోయింది. బ్యాంక్ లు, ప‌బ్లిక్ రంగ సంస్థలు, స్టీల్, మోటారు, ఆయిల్ కంపెనీలు షేర్లు మూడు శాతం నుంచి ఏడు శాతం వ‌ర‌కూ న‌ష్టాల‌ను మూట‌గ‌ట్టుకున్నాయి.
    
భారత్ స్టాక్ మార్కెట్లో మరో బ్లాక్ మండేగా పేర్కొంటున్న ఈ రోజు భారీ నష్టాలు ఏర్పడడానికి మరికొన్ని కారణాలూ కనిపిస్తున్నాయి. చైనా మార్కెట్ పతనం ఒక కారణం కాగా ఇండియాపై ఉగ్రదాడులు, అంతర్జాతీయంగా మరికొన్ని మార్కెట్ల పతనం వంటివీ కారణాలుగా కనిపిస్తున్నాయి. కారణమేదైనా రూ.లక్షన్నర కోట్ల సంపద హారతి కర్పూరమైంది.
Tags:    

Similar News