ఒక నియంత నుంచి విముక్తి పొంది.. స్వేచ్ఛా జీవనం సాగించటం ప్రపంచంలో మరే ప్రాంతంలో అయినా గుర్తుంచుకుంటారు. కానీ.. చిత్రంగా మన దేశంలో మాత్రం అందుకు భిన్నంగా. సదరు నియంత అయిన రాజుకు మతాన్ని ముడేసి.. ఆ నియంత నీడ నుంచి స్వేచ్ఛా స్వాతంత్ర్యం వెలుగులోకి రావటం కూడా ఆ మతస్తుల మనోభావాలు దెబ్బ తీస్తాయని చెప్పటానికి మించిన దౌర్భాగ్యం మనకు మాత్రమే సొంతమేమో.
నిజాం పాలనలో ఎంత ఆరాచకం చోటు చేసుకుందో చరిత్ర చదివే చిన్న పిల్లాడు సైతం ఇట్టే చెప్పేస్తారు. అంతాదాకా ఎందుకు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేసీఆర్ సైతం.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రా పాలకులు తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించటం లేదని గళం విప్పిన వారే. మరి.. అలాంటి వ్యక్తి నేడు ముఖ్యమంత్రి అయిన తర్వాత.. సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహిస్తే.. ముస్లింల మనోభావాలు దెబ్బ తింటాయన్న చిత్రమైన వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు.
మన అదృష్టం ఏమిటంటే.. ఉమ్మడి రాష్ట్ర పాలకులు.. నేటి తెలంగాణ అధికారపక్షం నేతలు లాంటి వారి మాదిరే.. నాడు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన జాతీయ నాయకులు బ్రిటీషోడు.. వాడి క్రిస్టియన్ మతం గురించి ఆలోచించి.. దేశంలోని క్రిస్టియన్ల మనోభావాలు దెబ్బ తింటాయని భావించి ఉంటే ఈ రోజు ఆగస్టు పదిహేను సందర్భంగా నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవాన్ని కూడా జరుపుకునే వాళ్లం కామేమో.
దేశం మొత్తానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్ర్యం వచ్చినా.. హైదరాబాద్ సంస్థానానికి మాత్రం స్వాతంత్ర్యం రాలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే.. భారత్ యూనియన్ లోకి తాను చేరనంటూ మంకు పట్టు పట్టిన నిజాం.. ఒకదశలో హైదరాబాద్ స్టేట్ ను పాకిస్థాన్ లో కలిపేయాలని చూడటం మర్చిపోకూడదు. ఇంతా చేసి నిజాం ఏమైనా మంచోడా అంటే.. అతని హయాంలో రజాకార్లు జరిపిన రాక్షసకాండ ఇప్పటికి మంట పుట్టిస్తుంటుంది. అలాంటి దుర్మార్గపు రాజు నుంచి హైదరాబాద్ స్టేట్ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించేందుకు నాటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్యకు నిర్ణయం తీసుకోవటంతో నాటి నియంత నిజాం శరణు జాచి.. సంధి చేసుకొని.. భారత యూనియన్ లో తన రాజ్యాన్ని కలిపేశారు.
ఇదంతా జరిగింది సెప్టెంబరు 17న. ఇంతటి చారిత్రక దినోత్సవాన్ని నాటి నుంచి నేటి వరకూ పలు ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా ఏదో కారణం చెప్పి అధికారికంగా నిర్వహించేవారు కాదు. నిజాంను దించేసి భారత్ యూనియన్ లోకి చేరిపోవటాన్ని ఉత్సవంగా చేస్తే ముస్లింల మనోభావాలు దెబ్బతింటాయని ఓటుబ్యాంకు రాజకీయాలతో రాజకీయ పార్టీలు వ్యవహరించటం తాజా పరిస్థితి కారణం అవుతుంది.
ఒక నియంత కబంధ హస్తాల్లో నుంచి బయటపడిన చారిత్రక ఘటనను సంతోషంగా జరుపుకోలేని దుస్థితిని తెలంగాణ ప్రజలకు మాత్రమే ఉంటుందేమో. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అదికారికంగా నిర్వహిస్తానని నాడు బీరాలు పలికిన కేసీఆర్.. నేడు ముఖ్యమంత్రి హోదాలో నో అని చెప్పేస్తున్నారు. అదేమంటే.. మనోభావాలు అంటున్నారు.
ఒకవేళ ముస్లింలకు మాత్రమే మనోభావాలు ఉంటాయనుకుంటే.. హిందువులకు మనోభావాలు ఉండవా? విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తే ముస్లింల మనోభావాలు దెబ్బ తింటాయని చెబుతున్న పాలకులు.. ఒకవేళ అందుకు భిన్నంగా వ్యవహరిస్తే.. మిగిలిన వర్గాల మనోభావాలు దెబ్బ తినవని ఎందుకు భావించటం లేదు? లోపం ఎక్కడుంది? ప్రాణాలు పణంగా పెట్టి.. పోరాడిన యోథులకు ఇంతకు మించిన అవమానం ఇంకేమైనా ఉంటుందా..? ఈ ప్రశ్నలు అధికార పక్షాన్ని ప్రశ్నించేవారు ఎవరు..?