మగ కామాంధుడు ...190 మంది అబ్బాయిలపై రేప్ !

Update: 2020-01-08 12:04 GMT
ఈ సమాజంలో ఆడవారికే కాదు మగవారికి కూడా సరైన రక్షణ లేదు అని అనిపిస్తుంది. దీనికి కారణం ప్రస్తుతం ఈ సమాజంలో వెలుగు చూస్తున్న ఉదంతాలే.  తాజాగా అందరూ ఆశ్చర్యపోయే సంఘటన ఒకటి బయటకి వచ్చింది. ఓ యువకుడు ఒకరు కాదు - ఇద్దరు కాదు. ఏకంగా 190 మంది మగాళ్ల మీద అత్యాచారం చేశాడు. వారందరినీ రేప్ చేస్తున్న వీడియోలు కూడా తీసుకుని భద్రంగా తన మొబైల్ ఫోన్‌ లో దాచుకున్నాడు. బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.  

పూర్తి వివరాలు చూస్తే ... బ్రిటన్ చరిత్రలోనే డేంజరస్ రేపిస్టుగా ముద్రపడిన వీడి పేరు రేన్హార్డ్ సినాగా. ఇతని వయసు ప్రస్తుతం 36 ఏళ్ళు . మాంచెస్టర్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు.  సినాగా సొంతదేశం ఇండోనేషియా. వాళ్ల నాన్న బాగా డబ్బున్న మనిషి కావడంతో  2007 సంవత్సరంలో చదువు కోసం బ్రిటన్ వలస వచ్చాడు. చదువుకోసం అక్కడికి వచ్చిన తరువాత , తన కోరికని  తీర్చుకోవడానికి ఓ ప్లాన్ వేశాడు. మాంచెస్టర్ క్లబ్‌ను అందుకు వాడుకున్నాడు. మాంచెస్టర్ క్లబ్‌లో ఫుల్లుగా తాగి ఇంటికి సరిగా వెళ్లలేని వారిని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. వారికి తన ఇంట్లో ఉండేందుకు అవకాశం ఇస్తానని తీసుకెళ్లేవాడు. అనంతరం తన ఇంటికి వెళ్లిన తర్వాత వారికి మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చేవాడు. ఆ తర్వాత వారి మీద పడి తన శరీర వాంఛ తీర్చుకునేవాడు. గదిలో జరిగే సీన్లను తన మొబైల్ తో చిత్రీకరించి, ఆ తరువాత  ఆ వీడియోలు, ఫొటోలను అడ్డంపెట్టుకుని బాధితులని  బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఇలా వీడి కామదాహానికి ఇప్పటివరకు 230 మంది అబ్బాయిలు బలయ్యాయి.

ఆ రోజు ఓ యువకుడికి కూడా ఇలాగే తన ఇంట్లో ఉండేందుకు షెల్టర్ ఇచ్చాడు. అతడికి కూడా అలాగే కూల్ డ్రింక్‌ లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. అతడితో శృంగారం జరుపుతున్న మధ్యలోనే యువకుడికి మెలకువ వచ్చింది. తన మీద జరుగుతున్న అత్యాచారాన్ని చూసి భయపడిన యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని పట్టుకున్నారు.  2007 నుంచి 2017 దాకా మొత్తం 190 మంది మ‌గ‌వాళ్లపై లైంగికదాడులు చేశాడని బ్రిటీష్ పోలీసులు చెప్పారు. అతని డిజిట‌ల్ డైరీల్లో సుమారు 3.29 టెరాబైట్ల డేటాను సేకరించామని, వాటి నిండా సెక్స్ వీడియోలు, అసభ్యకర ఫొటోలున్నాయని తెలిపారు. ఆధారాలన్నీ పక్కాగా ఉండటంతో రేన్హార్డ్ సినాగాకు కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది.
Tags:    

Similar News