ఎన్డీ తివారీ...ఈ సీనియర్ నేత గురించి తెలుగువారికి పరిచయం అవసరం లేదు. ఉమ్మడి ఏపీ గవర్నర్ గా పనిచేసిన తివారీ ఆ సమయంలో సెక్స్ స్కాండల్‌లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. సాక్షాత్తు రాజ్‌భవన్ వేదికగానే ఆయన సాగించిన రసిక కలాపాలు రచ్చ రచ్చగా మారాయి. ఈ పరిణామం దేశవ్యాప్తంగా కలకలం రేకెత్తించింది. అనంతరం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన ఎన్డీ తివారి కొద్దికాలం క్రితం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సెకండ్ ఇన్సింగ్స్‌తో ముందుకు సాగాలనుకున్న తివారీకి ఆరోగ్యం సహకరించడం లేదు. ఆయన తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.
ఎన్‌డీడి తివారీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని.... మెదడులో రక్తనాళాలు చిట్లిపోవడంతో ఆయనను సాకేత్‌లోని మాక్స్ ఆసుపత్రిలో చేర్పించినట్లు తివారీ మేనకోడలు మనీషి తివారి చెప్పారు. పరిస్థితిని డాక్టర్లు అధ్యయనం చేస్తున్నట్లు ఆమె వివరించారు. కాగా, కొద్దికాలం క్రితం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. 91 ఏళ్ల తివారీ కేంద్ర మంత్రిగా, రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా, ఉమ్మడి ఏపీ గవర్నర్ గా పని చేశారు. కాంగ్రెస్ పార్టీలో మంచి గుర్తింపు ఉన్న నాయకుడైన ఎన్డీ తివారీ సెక్స్ స్కాండల్ లో ఆరోపణలు ఎదుర్కొన్న అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆయనను దూరంగా ఉంచింది.