ప్రపంచ దేశాలకు తాలిబన్లు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆఫ్ఘనిస్థాన్ లో తమ ప్రభుత్వాన్ని ప్రపంచదేశాలు గుర్తించకపోతే సమస్యలు ఎదుర్కోక తప్పదంటూ గట్టిగా హెచ్చరికలు జారీచేశారు. ఇంత హఠాత్తుగా యావత్ ప్రపంచాన్ని తాలిబన్లు తీవ్రంగా హెచ్చరించాల్సినంత అవసరం ఏమొచ్చింది ? ఏమొచ్చిందంటే నిధుల సమస్య, ఆహార సమస్యతో ఆఫ్ఘన్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. పౌర ప్రభుత్వాన్ని కూల్చేసి తాలిబన్లు ఎప్పుడైతే ఆఫ్ఘన్లో అధికారాన్ని కబ్జాచేశారో వెంటనే ప్రపంచ దేశాలతో సమస్యలు మొదలయ్యాయి.
తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించేది లేదని ప్రపంచంలోని చాలా దేశాలు ప్రకటించాయి. దాంతో వెంటనే అనేక దేశాలకు ఆఫ్ఘన్ కు మధ్య ఉన్న వాణిజ్య ఒప్పందాలన్నీ తెగిపోయాయి. దాంతో ఆఫ్ఘన్ కు దిగుమతులు, ఎగుమతులు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. ఇదే సమయంలో వివిధ దేశాల్లో ఉన్న ఆప్ఘన్ నిధులను ఆయా ప్రభుత్వాలు ఫ్రీజ్ చేసేశాయి. వందల కోట్ల విలువైన బంగారం నిల్వలు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాల్లో ఉన్నాయి.
అలాగే ఆఫ్ఘన్ కు సంబంధించి విదేశీ బ్యాంకుల్లో ఉన్న బిలియన్ల డాలర్లను కూడా ఆయా దేశాలు ఫ్రీజ్ చేసేశాయి. దాంతో రోజువారీ కార్యకలాపాలు రన్ చేయడానికి కూడా ఇపుడు తాలిబన్ల ప్రభుత్వానికి ఇబ్బందులుగా మారాయి. వాణిజ్యపరమైన ఒప్పందాలు నిలిచిపోవడంతో విదేశీ మారకద్రవ్య నిల్వలు ఆవిరైపోయాయి. ఇదే సమయంలో బిలియన్ డాలర్ల కరెన్సీ నిల్వలను విదేశాల్లోని బ్యాంకులు ఫ్రీజ్ చేసేయటంతో అవి కూడా అందుబాటులో లేకుండా పోయాయి. పాకిస్తాన్, చైనా తప్ప తాలిబన్ ప్రభుత్వాన్ని మరే దేశమూ గుర్తించలేదు.
ఎప్పుడైతే నిధులకు తాలిబన్ ప్రభుత్వం కటకటలాడుతోంది. దీని ప్రభావం మామూలు జనాలపైన పడుతోంది. బ్యాంకుల్లో కూడా నిధులు లేకపోవటంతో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్దితి లేదు. దిగుమతులు ఆగిపోవటంతో నిత్యావసరాల ధరలు ఆకాశానికి ఎగబాకాయి. దాంతో మధ్య తరగతి జనాలు కూడా మూడు పూటలా భోజనం చేసి ఎంతకాలమైందో ఎవరు చెప్పలేకున్నారు.
ఇదే పరిస్ధితి మరికొద్ది రోజులు కంటిన్యు అయితే అంతర్యుద్ధం మొదలవ్వటం ఖాయమని తాలిబన్లకు అర్ధమైపోయింది. మామూలు ప్రజలంతా ఏకమై తిరుగుబాటు లేవదీస్తే తాలిబన్లు దేశాన్ని వదిలిపోవటం తప్ప మరో మార్గం లేదు. ఆ పరిస్థితి రాకూడదనే తాలిబన్లు అర్జంటుగా విదేశాలకు వార్నింగ్ ఇచ్చారు. తమతో పెట్టుకుంటే ప్రపంచానికి సమస్యలు తప్పవని హెచ్చరించటానికి కారణం ఇదే. ఇక్కడ సమస్యలంటే ప్రధానంగా విదేశాల్లో తీవ్రవాద చర్యలకు దిగుతామని మాత్రమే అని అనుకోవాలి. మరి తాలిబన్ల వార్నింగును ప్రపంచం ఎలా తీసుకుంటుందో చూడాలి.