కేంద్రం చేసిన తాజా ప్రకటనకు భారత జాతీయ రెస్టారెంట్ల అసోసియేషన్ ఓ రేంజ్లో రియాక్ట్ అయిన పరిస్థితి. సేవ ఛార్జీలను వినియోగదారుడు తమకు నచ్చిన రీతిలోనే చెల్లించాలే కానీ.. రెస్టారెంట్లు ప్రకటించిన రీతిలో మాత్రం ఇష్టారాజ్యంగా సర్వీసు ఛార్జ్ బాదేయటం సబబు కాదంటూ నిన్నటికి నిన్న ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనపై జాతీయ రెస్టారెంట్ల అసోసియేషన్ తీవ్రంగా రియాక్ట్ అయ్యింది.
ఒకవేళ సేవా ఛార్జీలను చెల్లించటం కుదరని పక్షంలో.. తమ రెస్టారెంట్లకు రావాల్సిన అవసరమేలేదంటూ గడుసుగా రియాక్ట్ అయిన పద్ధతిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారులకు తెలియకుండా విధించే సర్వీస్ ఛార్జీలు చట్టవిరుద్ధమని.. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు.
తాజా చట్టం తాము అక్రమాలు చేయకుండా అడ్డుకుంటుందని.. కానీ.. తాము తమ మెనూపై సర్వీసు ఛార్జీలు విధిస్తామని.. ఒకవేళ తాము విధించిన సర్వీసు చార్జీల్ని చెల్లించేందుకు సమస్యలు ఎదుర్కొనే వారి గురించి తాము తెలుసుకుంటామని.. ‘‘వారిని మేం గౌరవంగా అడుగుతాం. సర్వీసు ఛార్జ్ చెల్లిస్తారా అని. ఒకవేళ వారు సర్వీసు ఛార్జీలు చెల్లించేందుకు సిద్ధంగా లేనని చెబితే.. వారు వేరే రెస్టారెంట్లకు వెళ్లొచ్చని మేం చెబుతాం’’ అంటూ చెబుతున్నారు భారత జాతీయ రెస్టారెంట్ల అసోషియేషన్ అధ్యక్షుడు రియాజ్ అమ్లాని పేర్కొన్నారు. మరి ఇలాంటి ఘాటు రియాక్షన్ పై కేంద్రం ఎలా రియాక్ట్ కానుందన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.