చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై రోజుకో రకమైన వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ ఎన్‌కౌంటర్‌ను ప్రత్యక్షంగా చూసిన కొందరు సాక్షులు జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిసి ఎన్‌కౌంటర్ జరిగిన తీరును, వారు చూసిన వాస్తవాన్ని తెలియజేశారు. దీంతో ఏపీ ప్రభుత్వం, పోలీసు ఇరుకున పడ్డట్లయ్యింది. " ఎర్రచందనం కూలీలను ఎన్‌కౌంటర్‌కు ముందుపోలీసులు అదుపులోకి తీసుకున్నారని" ప్రత్యక్ష సాక్ష్యులు జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందు చెప్పారు. ఈ మేరకు.. శేఖర్, బాలచంద్రన్ అనే ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు జాతీయ మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశారు. దీంతో శేషాచలం అడవుల్లోని ఎన్‌కౌంటర్ రసకందాయంలో పడింది.
ఇప్పటికే ఈ విషయంపై ఏపీ - తమిళనాడుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఏపీ ప్రభుత్వం కావాలనే అమాయకులైన తమిళకూలీలను పొట్టనబెట్టుకుందని వారిస్తున్న వారి వాదనకు ఈ సాక్ష్యుల వాంగూలంతో బలం చేకూరినట్లయ్యింది. అయితే ఈ విషయాన్ని ఇప్పటికే హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించి విచారిస్తోంది. ఈ తాజా ఫిర్యాదుతో కేసు కీలక మలుపు తిరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే... ఆ కూలీలంతా పోలీసులపై దాడిచేస్తుంటేనే... ఆత్మ రక్షణలో భాగంగా కాల్పులు జరిపామని ఎర్రచందనం ఎన్ కౌంటర్ పై ఏపీ పోలీసు వాదన ఉంది. కాగా... ఈ ఎన్‌కౌంటర్‌పై త్వరలోనే దర్యాప్తు చేపట్టనున్నట్టు జాతీయ మానవహక్కుల కమిషన్ ఛైర్మన్ రిటైర్డ్ జస్టీస్ కేజీ బాలకృష్ణన్ తెలిపారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఇరుకున పడినట్లే అని... ఇది నిరూపితమైతే పరిణామాలు తీవ్రంగా ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు!