తెలంగాణ నుంచి ఏడు.. ఏపీ నుంచి సున్నా

Update: 2022-02-09 10:30 GMT
ఈ ఎస్ఏజీవై ర్యాంకుల్లో క‌రీంన‌గ‌ర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెన్నంప‌ల్లి దేశంలోనే మొద‌టి స్థానంలో నిలిచింది. టీఆర్ఎస్ ఎంపీ కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు ఈ గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుని అభివృద్ధి చేశారు.

  నిజామాబాద్ జిల్లా జుక్క‌ల్ మండ‌లం కౌలాస్ గ్రామం రెండో స్థానంలో నిలిచింది. క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని గ‌న్నేరువ‌రం 4వ‌, వీర్నప‌ల్లి 6వ‌, రామ‌కృష్ణాపూర్ 9వ‌,  నిజామాబాద్ జిల్లాలోని కంద‌కుర్తి 5వ‌, తాణాకుర్ద్ 10వ స్థానాల్లో నిలిచాయి.

టాప్ 20లో 11 గ్రామాలు చోటు ద‌క్కించుకున్నాయి. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్‌, నిజామాబాద్ జిల్లాల్లో ఎంపీలు ద‌త్త‌త తీసుకున్న గ్రామాలు వ‌రుస‌గా 1, 2, 4, 5, 6, 9, 10 స్థానాల్లో నిల‌వ‌డం విశేషం.

నిధులు లేక‌..

మ‌రోవైపు ఏపీ నుంచి ఒక్క గ్రామం కూడా ఈ జాబితాలో చోటు ద‌క్కించుకోలేక‌పోయింది. కేర‌ళ‌, జార్ఖండ్‌, ఒడిషా లాంటి రాష్ట్రాల నుంచి క‌నీసం ఒక్కో గ్రామానికైనా ర్యాంకులు ద‌క్కాయి. కానీ ఏపీకి మాత్రం ఎలాంటి స్థానం ద‌క్క‌లేదు. అందుకు నిధుల లేమి కార‌ణ‌మ‌ని విప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి.  

వివిధ ప‌థ‌కాల కింద ఆర్థిక క‌మిష‌న్‌, కేంద్ర ప్ర‌భుత్వం పంచాయ‌తీల‌కు అందించే నిధులను కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల కోసం ప‌క్క‌దారి ప‌ట్టిస్తోంద‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ఇప్ప‌టికే అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ప్ర‌భుత్వం పంచాయ‌తీ నిధుల‌ను కూడా వాడేస్తుంద‌ని స‌ర్పంచ్‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇప్ప‌టికే గుంటూరు జిల్లా స‌ర్పంచ్‌ల సంఘం వెంట‌నే ప‌క్క‌దారి ప‌ట్టించిన పంచాయ‌తీ నిధుల‌ను విడుద‌ల చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. దాదాపు గ‌త ఏడాదిన్న‌ర‌గా పంచాయ‌తీల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం నిధులు ఇవ్వ‌లేద‌ని, క‌నీసం త‌మ గౌర‌వ వేత‌నాల‌నైనా చెల్లించ‌లేద‌ని స‌ర్పంచ్‌లు అంటున్నారు. మ‌రోవైపు కేంద్ర ప్ర‌భుత్వం కూడా ఈ స‌మ‌స్య‌పై దృష్టి సారిస్తామ‌ని పేర్కొంది. మ‌రోవైపు ఏక‌గ్రీవంగా స‌ర్పంచ్‌ల‌ను ఎన్నుకున్న గ్రామాల‌కు వ‌చ్చే రూ.10 ల‌క్ష‌ల న‌గ‌దు అవార్డును కూడా ప్ర‌భుత్వ‌మే వాడుకుందున్న ఆరోప‌ణ‌లున్నాయి.

Tags:    

Similar News