ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత - వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డికి మరిన్ని షాకులు తప్పేలా లేవు. ఈ రోజు హైదరాబాద్ లోటస్ పాండ్ లోని తన నివాసంలో ఆయన ఏర్పాటు చేసిన సమావేశానికి ఏడుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. సుజయ కృష్ణ రంగారావు (బొబ్బిలి) - మణిగాంధీ (కోడుమూరు) - గౌరు సుచరిత (పాణ్యం) - శివ ప్రసాద్ రెడ్డి (ప్రొద్దుటూరు) - తిప్పేస్వామి (మదనపల్లి) - బాల నాగిరెడ్డి (మంత్రాలయం) - మేకపాటి గౌతమ్ రెడ్డి (ఆత్మకూరు) ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. ఐతే ఈ పరిణామాన్ని ముందే ఊహించారో ఏమిటో.. వ్యక్తిగత కారణాలతోనే ఆ ఎమ్మెల్యేలు రాలేకపోయారని.. దీని గురించి దుష్ట్రచారం చేయొద్దని వైకాపా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియా ముందుకొచ్చి చెప్పడం విశేషం.
మార్చి 5 లోపు వైకాపా ఖాళీ అయిపోతుందని తెదేపా మంత్రులు హెచ్చరించిన నేపథ్యంలో ఎందుకైనా మంచిదని ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు జగన్. ఎంతమంది ఎమ్మెల్యేలు తనవైపు ఉన్నారో తేల్చుకునేందుకే ఈ సమావేశం అని అంటున్నారు. ఐతే జగన్ అనుమానించినట్లే ఎమ్మెల్యేలు కొందరు డుమ్మా కొట్టారు. దీంతో వీళ్లందరూ జంపింగ్ జపాంగ్ లే అన్న నిర్ణయానికి వచ్చేసే ఉంటాడేమో జగన్. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయాలని జగన్ యోచిస్తున్నట్లు సమాచారం. అంతే కాక స్పీకర్ ను కలిసి పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఒత్తిడి తేవాలని అనుకుంటున్నారట.