టీడీపీకి దడ పుట్టిస్తున్న డెబ్బై సీట్లు...?

Update: 2022-04-01 09:30 GMT
ఏపీలో టోటల్ గా ఉన్నవే 175 సీట్లు. ఉమ్మడి ఏపీలో 294 సీట్లు ఉంటే అక్కడ నుంచి సగానికి పడిపోయాయి. మరి ఇపుడు చూసినా తెలంగాణా కంటే ఎక్కువ సీట్లే ఏపీకి ఉన్నాయి. మరి ఏపీలో 175 సీట్లలో రాజకీయం ఏంటి ఎలా ఉంది అంటే అధికార పార్టీలో ఫుల్ క్రౌడ్ కనిపిస్తోంది. విపక్షం లో డల్ అలాగే కంటిన్యూ అవుతోంది.

వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించుతామని పూటకోసారి గట్టిగా చెబుతున్న టీడీపీ పరిస్థితి ఇపుడు ఎలా ఉంది అంటే వంద చోట్ల మాత్రమే పార్టీ యాక్టివిటీ బాగా జరుగుతోంది. అనేక కారణాల వల్ల డెబ్బైకి పైగా సీట్లలో మాత్రం పెద్దగా చురుకు లేకుండా పోయింది అంటున్నారు. అలా వీక్ గా ఉన్న సీట్లుగా వీటిని గుర్తించారు అంటున్నారు.

డెబ్బై సీట్లలో నాయకత్వ లేమి ఉన్నట్లుగా కూడా భావిస్తున్నారు. ఇపుడు  ఉన్న వారు, పార్టీ అధికారంలో ఉన్నపుడు పవర్ చలాయించిన వారు కూడా ఈ రోజు పెద్దగా సౌండ్ చేయడంలేదు. దాంతో అక్కడ ఏ కార్యక్రమం ఇచ్చినా పెద్దగా జరగడంలేదని నివేదికలు వస్తున్నాయి. మరి ఎన్నికలు చూస్తే రెండేళ్లకు వచ్చిపడ్డాయి.

ఈ పరిస్థితులలో ఇప్పటి నుంచే అన్నీ చక్కదిద్దుకోకపోతే మాత్రం ఇబ్బందే అన్న టాక్ అయితే ఉంది. ఇదిలా ఉండగా వందకు పైగా నియోజకవర్గాలలో పోటీ బాగా ఉంది. చాలా మంది నాయకులు ఉన్నారు. కానీ అవసరం అనుకున్న చోట మాత్రం నేతల కొరత పీడిస్తోంది.

నిజానికి వైసీపీ అధికారంలోకి వచ్చాకా చాలా చోట్ల టీడీపీ క్యాడర్ పడకేసింది. అదే విధంగా ఉన్న వారు కూడా ఆ పార్టీలోకి జారుకుంటే చాలా మంది మనకెందుకు అనుకున్నారు. దాంతొనే ఇపుడు దుస్థితి ఏర్పడింది అంటున్నారు. అయితే అన్ని రోజులూ ఒక్కలా ఉండవు కదా. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన వారు మళ్లీ ఇటు వైపు చూస్తున్నారు.

అదే విధంగా మంత్రి వర్గ విస్తరణ తరువాత అధికార పార్టీలో కచ్చితంగా అసంతృప్తి వెల్లువెత్తుతుంది. దాంతో వెంటనే కాకపోయినా కొద్ది రోజుల తరువాత అయినా అటు నుంచి ఇటు నేతల తాకిడి ఉంటుంది. అలా వచ్చిన వారిలో కొంతమందితో పార్టీ బలహీనంగా ఉన్న చోట గట్టిపరచుకోవాలని ఆ పార్టీ చూస్తోంది.  మరో వైపు కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలని కూడా ఆలోచిస్తోంది.  అలా వీటిని  అధిగమించేందుకు టీడీపీ కొత్త ఎత్తుగడలకు రంగం సిద్ధం చేసింది  అంటున్నారు.

అదే విధంగా పొత్తులలో భాగంగా కొన్ని సీట్లను మిత్రులకు ఇవ్వడం ద్వారా భారాన్ని దించుకోవాలనుకుంటోంది. ఏది ఏమైనా టీడీపీ 150 సీట్లలో స్ట్రాంగ్ గా ఉండాలని టార్గెట్ పెట్టుకుంది అంటున్నారు. దానికి కాస్తా అటు ఇటుగా పొత్తులతో పోటీ చేస్తే వందకు పైగా సీట్లు సొంతంగా సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమన్నదే ఆ పార్టీ మాస్టర్ ప్లాన్ గా ఉందని అంటున్నారు.
Tags:    

Similar News