గన్ కల్చర్ ఎక్కువగా ఉండే అమెరికాలో ఎవరు ఎప్పుడు తమ దగ్గరున్న గన్ కు పని చెబుతారో అర్థం కాని పరిస్థితి. దీంతో.. తరచూ అమాయకులు బలి అవుతుంటారు. గన్ కల్చర్ మీద విమర్శలు ఎన్ని ఉన్నా.. వాటిని నియంత్రించే విషయంలో అగ్రరాజ్యం ఇప్పటికే తేల్చుకోలేని పరిస్థితి.
ఇదిలా ఉంటే తాజాగా కాలిఫోర్నియాలోని శాన్ బ్రూనోప్రాంతంలో ఉన్న ఒక షాపింగ్ మాల్ లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మాల్ లోని వారిని బయటకు పంపేశారు.
మాల్ కు సమీపంలోని రైల్వే స్టేషన్ ను కూడా మూసివేశారు. కాల్పుల ఉదంతంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కావాలనే ఆగంతుకులు తుపాకీ కాల్పులు జరిపినట్లుగా ప్రాథమిక విచారణలో గుర్తించారు. కాల్పులకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు పోలీసులు వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ కాల్పుల ఉదంతం కాలిఫోర్నియా నగరంలో సంచలనంగా మారింది.