ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ముందు ముందు షాకులు మీద షాకులు తగలనున్నాయా? తెలుగు తమ్ముళ్లు పార్టీని వీడిపోనున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని గద్దె దించేందుకు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ స్నేహం ఆంధ్రప్రదేశ్ లో కూడా కొనసాగుతుందనే వార్తలొస్తున్నాయి. తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేసేందుకు - వివిధ కేసుల నుంచి తాను బయటపడేందుకు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో కలిసారని - తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. పార్టీకంటే తనకు, తన కుటుంబానికే మేలు జరగాలని భావిస్తున్న చంద్రబాబు ఎవరు ఏమైనా తనకు ఫర్వాలేదనే ధోరణిలో ఉన్నారని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంగా ఉన్నారు.
ముఖ్యంగా సీనియర్లు కాంగ్రెస్ తో పొత్తుపై మరింత ఆగ్రహంగా ఉన్నారంటున్నారు. తాజాగా మంత్రి - ఎమ్మెల్యే రావుల కిషోర్ బాబు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన పార్టీని వీడి జనసేనలో చేరుతారని అంటున్నారు. ఆయనతో పాటుగా మరి కొందరు సీనియర్లు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే రాయలసీమకు చెందిన కొందరు నాయకులు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో మరిన్ని వలసలు పెరుగుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న వైఎస్. జగన్ మోహన రెడ్డిని తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్లు కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో కలసి పోటీ చేస్తే ఏపీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతోందని సమాచారం అందుతోంది. ఈ విషయంపై చంద్రబాబు నాయుడుకు హస్తం అంటే అసహ్యించుకునే ఆయన సొంత సామాజిక వర్గం నుంచి కూడా వ్యతిరేకత వస్తున్నట్లు చెబుతున్నారు. తన వ్యక్తిగత అవసరాల కోసం తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ కు తాకట్టు పెడుతున్నారని చంద్రబాబు సామాజిక వర్గంలోని కొందరు పెద్దలు బహిరంగంగానే విమర్శిస్తున్నారంటున్నారు. అయిదు దశాబ్దాలుగా ఓ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా పనిచేసిన తాము ఒక్క చంద్రబాబు నాయుడి కారణంగా ఆ వైరాన్ని ఎలా మర్చిపోతామని ప్రశ్నిస్తున్నారు.