ఈ సంజ‌య్ గురించి వింటే షాక్ తినుడే

Update: 2017-08-18 05:10 GMT
ఇప్ప‌టివ‌ర‌కూ వార్త‌ల్లో వినిపించ‌ని స‌రికొత్త వార్తగా దీన్ని చెప్పాలి. త‌ర‌చూ మీడియాలో వ్య‌భిచార గృహాల మీద పోలీసుల దాడి లాంటి వార్త‌లు చదువుతుంటాం. కానీ.. ఇలాంటి వ్య‌భిచార గృహాల‌కు డాన్ లాంటి వ్య‌క్తికి సంబంధించిన వ్య‌వ‌హారాన్ని పోలీసులు బ‌య‌ట‌కు లాగారు. అంత‌ర్రాష్ట నెట్ వ‌ర్క్ ను ఏర్పాటు చేసి.. పెద్ద ఎత్తున యువ‌తులతో కూడిన వ్య‌భిచార రాకెట్‌ ను నిర్వ‌హిస్తున్న వ్య‌క్తిగా సంజ‌య్ ను గుర్తించారు. కోల్ క‌తాకు చెందిన ఇత‌గాడి హిస్ట‌రీని బ‌య‌ట‌కు లాగుతున్న పోలీసుల‌కు షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి.

రీసెంట్ గా మాదాపూర్ లోని ఒక వ్య‌భిచార గృహం మీద పోలీసులు దాడి చేశారు. ఈ సంద‌ర్భంగా ఒక అంత‌ర్రాష్ట్ర ముఠాను పోలీసులు గుర్తించారు. వారిని విచారించిన‌ క్ర‌మంలో పోలీసుల‌కు షాకింగ్ వివ‌రాలు తెలిశాయి. యాభై వెబ్ సైట్లు.. పెద్ద ఎత్తున ఉద్యోగుల‌తో న‌డిపే ఒక కార్యాల‌యాన్ని గుర్తించారు.

మాయ మాట‌ల‌తో అమాయ‌క‌పు అమ్మాయిల్ని ఆక‌ర్షించి.. వారికి డ‌బ్బు ఎర చూపించి వ్య‌భిచార కూపంలోకి నుడుతున్న స‌రికొత్త దందా బ‌య‌ట‌కు వ‌చ్చింది. హైటెక్ ప‌ద్ద‌తిలో న‌డుపుతున్న ఈ వ్య‌భిచార గృహాల‌కు డాన్ గా సంజ‌య్ అనే వ్య‌క్తిని గుర్తించారు. కోల్ క‌తాకు చెందిన ఇత‌గాడు మామూలోడు కాద‌ని.. భారీ ఎత్తున డ‌బ్బును ఆఫ‌ర్ చేసి అమ్మాయిల‌ను ప‌డ‌గొట్టేవాడ‌ని చెబుతున్నారు.

కోల్ క‌తా కేంద్రంగా సాగే ఈ దందాను దేశంలోని అన్ని ముఖ్య న‌గ‌రాల్లోనూ వ్య‌భిచార కేంద్రాల్ని ఓపెన్ చేసిన‌ట్లు చెబుతున్నారు. ఆన్ లైన్ ద్వారా సాగే ఈ దందాలో డిమాండ్‌ కు త‌గ్గ‌ట్లు వివిధ న‌గారాలకు చెందిన మ‌హిళ‌ల్ని ఎంపిక చేస్తారు. వారికి డ‌బ్బుతో ప్ర‌లోభ పెడ‌తారు. అవ‌స‌ర‌మైతే విదేశీ టూర్ల‌కు పంపిస్తారు. విలాసాలు అల‌వాటు చేస్తారు. వ్య‌భిచారంలోకి అడుగు పెడితే కాసులే కాసుల‌న్న‌ట్లుగా ఆశ‌లు రేపుతారు. తాను చెప్పిన‌ట్లుగా వినే వారికి వారానికి రూ.2ల‌క్ష‌ల వ‌ర‌కూ ఇచ్చేవాడ‌ని చెబుతున్నారు.

సంజ‌య్ వ‌ల‌లో ప‌డిన వారిలో మోడ‌ల్స్‌.. మాజీ మోడ‌ల్స్ తో పాటు ప‌లువురు అమ్మాయిలు ప‌డుతుంటార‌ని చెబుతున్నారు. ఆన్ లైన్లో వారి ఫోటోల‌ను అప్ చేసి.. వారికున్న డిమాండ్ ఆధారంగా డ‌బ్బుల్ని ఫిక్స్ చేస్తారని చెబుతున్నారు. ఈ ఉదంతానికి సంబంధించి సంజ‌య్ తో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ని భావిస్తున్న భార్య‌భ‌ర్త‌లు రాజేశ్ ప‌ర్వాల్‌.. ఆర్తీ ప‌ర్వాల్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిచ్చిన స‌మాచారంతో మ‌రికొంద‌రిని అదుపులోకి తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. వారిని విచారించిన వేళ‌లోనే.. ఈ కొత్త త‌ర‌హా దందాకు సంబంధించిన కీల‌క స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఖ‌రీదైన ప్రాంతాల్లో గుట్టుచ‌ప్పుడు కాకుండా న‌డిచే ఈ వ్య‌భిచార దందాలో క‌స్ట‌మ‌ర్ల ఉంచి రోజుకు రూ.25 నుంచి రూ.ల‌క్ష వ‌ర‌కూ వ‌సూలు చేస్తార‌ని తెలుస్తోంది. త‌న ఉచ్చులో ప‌డ‌ని మ‌హిళ‌ల్ని ఏదో రూపంలో ఆక‌ర్షించేందుకు వీలుగా పెద్ద ఎత్తున డ‌బ్బును ఖ‌ర్చు చేయ‌టంతో పాటు.. విదేశాల‌కు జ‌ల్సాల కోసం పంప‌టం.. విమాన టికెట్లు కొని పంప‌టం చేస్తుంటార‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం అండ‌ర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయిన సంజ‌య్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అత‌గాడిని కానీ అదుపులోకి తీసుకుంటే.. మ‌రిన్ని సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని భావిస్తున్నారు.
Tags:    

Similar News