సెక్స్ రాకెట్.. ఇద్దరు నటీమణుల అరెస్టు

Update: 2017-04-09 06:15 GMT
సినిమా వాళ్లకు సెక్స్ రాకెట్లకు మధ్య సంబంధం బాగా బలపడిపోతోంది. సినిమాల్లో నటించే కొందరు వ్యభిచారంలోకి దిగుతున్నారు. కొందరు ఏకంగా పెద్దపెద్ద ముఠాలే నడిపిస్తున్నారు. సాగినంత కాలం గుట్టుగా సాగుతున్నా ఏదో ఒక రోజు ఇలాంటివి బయటపడి పరువు పోగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లోని కుషాయిగూడలో ఇలాంటిదే ఒక సెక్స్ రాకెట్ను పోలీసులు పట్టుకున్నారు. అందులో మొత్తం ముగ్గురు సినీ నటులు ఉండగా.. ఇద్దరు మహిళలు.
    
ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్ సమీపంలో కుషాయిగూడ వద్ద రాధిక కాంప్లెక్స్ అనే అపార్టుమెంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో స్పెషల్ ఆపరేషన్స్ టీం పోలీసులు రైడ్ చేశారు. ఈ రైడింగులో ముగ్గురు సినీ నటులు చిక్కారు.
    
కుషాయిగూడ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ రాకెట్ వెనుక ఎవరున్నారు... ఈ నటీమణులే నడిపిస్తున్నారా? లేదంటే ఇతరులు నడిపిస్తున్న రాకెట్లో వీరు వ్యభిచారం చేస్తున్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా కొద్ది కాలంలో హైదరాబాద్ లో స్పెషల్ ఆపరేషన్స్ టీం వరుసగా రైడింగులు చేస్తూ వ్యభిచార నిరోధానికి గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఈ క్రమంలో సాధారణ వ్యభిచారిణులతో పాటు సినీ నటులు, టీవీ నటులు, యాంకర్లు కూడా పలుమార్లు దొరికారు.
Tags:    

Similar News