కరోనా వేళ.. సెక్స్ వల.. కాలేజీ అమ్మాయిల ఎర

Update: 2020-03-27 06:08 GMT
కరోనా వైరస్ వ్యాపిస్తుందని దేశమంతా హడలి చస్తుంటే.. వీరు మాత్రం ఈ ఏకాంత నిర్మానుష్య అవకాశాన్ని వదలుకోలేదు. గుట్టుచప్పుడు కాకుండా వాట్సాప్ - పలు ఇతర యాప్స్ సహాయంతో విటులకు వల విసిరారు.  వారికి కాలేజీ అమ్మాయిలు - ఉద్యోగం కోసం వచ్చిన వారిని - ఒంటరి మహిళలను ఎరవేసి వ్యభిచారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా విస్తరించారు. ఈ ఘటన ఆంధ్రా సరిహద్దుల్లో చోటుచేసుకుంది.

ఆంధ్రా - కర్ణాటక బార్డర్ లోని కోలార్ ప్రాంతంలో ఈ భారీ సెక్స్ రాకెట్ వెలుగుచూసింది. కోలార్ ప్రాంతం  పాపులర్. ఎందుకంటే అప్పట్లో వచ్చిన ‘కేజీఎఫ్’ మూవీ మొత్తం ఈ కోలార్ గనుల చుట్టే తిరిగింది. అలాంటి చోట ఈ వ్యభిచార దందా వెలుగు చూడడం విశేషం.

కాలేజీ అమ్మాయిలు, ఒంటరి మహిళలు, ఉద్యోగం కోసం వచ్చిన యువతులను టార్గెట్ చేసిన ముఠా వాట్సాప్, సహా ఇతర యాప్స్ సహాయంతో విటులకు వల వేసింది.కాల్ గర్ల్స్ సప్లయ్ చేస్తామంటూ ఆఫర్ ఇచ్చింది. కోలార్ తోపాటు బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరులకు అమ్మాయిలను పంపిస్తున్నారు.

కాల్ గర్ల్స్ గా మారిన యువతకులకు తక్కువ మొత్తం ఇస్తూ విటుల నుంచి భారీగా వసూలు చేస్తూ ఈ ముఠా భారీగా దండుకుంది. సమాచారం అందిన పోలీసులు కరోనా వేళ గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ దందాను ప్రత్యేక ఆపరేషన్ లో పట్టుకున్నారు. నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 16మంది అమ్మాయిలను చెర నుంచి విడిపించారు.


Tags:    

Similar News